Royal Enfield Guerrilla 450: మార్కెట్ లోకి కొత్త ఎన్ఫీల్డ్ బైక్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!
ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు కూడా ఒకటి. చాలామంది వీటిని కొనాలని ఆశగా ఉన్నప్పటి
- By Nakshatra Published Date - 07:21 PM, Sat - 29 June 24
![Royal Enfield Guerrilla 450: మార్కెట్ లోకి కొత్త ఎన్ఫీల్డ్ బైక్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-29-Jun-2024-07-20-PM-1580.jpg)
ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు కూడా ఒకటి. చాలామంది వీటిని కొనాలని ఆశగా ఉన్నప్పటికీ కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అందుకే చాలామంది వాటిని కొనలేక అందుబాటులో సరసమైన ధరలో ఉండే బైక్‌లను కొనుక్కొని అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఎన్ఫీల్డ్ బైకులు అందరికీ అందుబాటులో సరసమైన ధరలకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల బైకులు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. త్వరలోనే మరొక బైక్ కూడా మార్కెట్లోకి విడుదల కానుంది.
ఈ మేరకు తాజాగా ఒక టీజర్ ని కూడా విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 మొదటి టీజర్‌ను సైతం తాజాగా విడుదల చేసింది. అంతేకాదు ఈ బైక్ లాంచ్‌పై ఒక అప్డేట్ ఇచ్చారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్. 2024 జూలై 17న గొరిల్లా 450 గ్లోబల్ లాంచ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ బైక్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 కొత్త హిమాలయన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న రెండో బైక్. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన షెర్పా 450 ఇంజిన్ ఉండనుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్లను హిమాలయన్ నుంచి తీసుకురాగా, ఈ మోడల్లో యూఎస్డీలకు బదులుగా ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులను సంస్థ అమర్చింది.
అలాగే వెనుక భాగంలో ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మోడల్ లో రౌండ్ డిజిటల్ ఇన్స్ట్రుమంమెంట్ కన్సోల్ కూడా ఉంది. నావిగేషన్ సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. గొరిల్లా 450 బైక్‌లో ఫ్లాట్ హ్యాండిల్ బార్, రోడ్ బయాస్డ్ టైర్లతో అల్లాయ్ వీల్స్, డిఫరెంట్ రైడింగ్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ ఆర్ఈ హిమాలయన్ 450 కంటే గణనీయంగా తేలికైనది. అయితే దీని బరువు ఎంతవరకు ఉంటుందో అనేది మాత్రం ఇంకా తెలియదు. ఇందులోని 452సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. హిమాలయన్ బైక్‌లో ఈ ఇంజిన్ సుమారుగా 39బిహెచ్పీ పవర్, 40ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
గొరిల్లా 450లో కూడా ఇవే ఫిగర్స్ ఉండొచ్చు. 6-స్పీడ్ గేర్ బాక్స్‌ని మార్చే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ గ్లోబల్ అరంగేట్రానికి ముందు మరిన్ని టీజర్లను ఆర్ఈ పంచుకునే అవకాశం ఉంది. ఇక ఇండియా లాంచ్ కోసం కొంత కాలం ఆగల్సిందే అని తెలుస్తోంది! పండుగ సీజన్ సమయంలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఇండియాలో లాంచ్ అవ్వొచ్చు. కొత్త గొరిల్లా 450 బైక్ ధర రూ .2.6 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఐదు కొత్త బైక్‌లు.. ఫీచర్లు ఇవే..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/New-Gen-Royal-Enfield-Bullet-350.jpg)
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఐదు కొత్త బైక్‌లు.. ఫీచర్లు ఇవే..!
Royal Enfield: ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) బైక్‌లు 350సీసీ అంతకంటే ఎక్కువ సెగ్మెంట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు 5 కొత్త బైక్‌లను విడుదల చేయబోతోంది. కొత్త బైక్‌ల ద్వారా కంపెనీ యువతను టార్గెట్ చేయనుంది. మీరు కొత్త హెవీ ఇంజన్ బైక్‌ను కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని రోజులు వేచి ఉండటం మీకు ప్రయోజనకరంగా �