Honda Car: క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ అందుకున్న హోండా కారు.. ఆ కారు ఫుల్ డిటైల్స్ ఇవే?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా తాజాగా సివిక్ ఇ:హెచ్ఇవి యూరో ఎన్‌సిఎపి సేఫ్టీ టెస్టింగ్ లాస్ట్ రౌండ్ లో 5-స్టార్
- By Nakshatra Published Date - 05:36 PM, Fri - 18 November 22
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా తాజాగా సివిక్ ఇ:హెచ్ఇవి యూరో ఎన్‌సిఎపి సేఫ్టీ టెస్టింగ్ లాస్ట్ రౌండ్ లో 5-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. అడల్ట్ ప్యాసెంజర్ సేఫ్టీలో హోండా ఇ:హెచ్ఇవి ఫ్రంటల్ ఇంపాక్ట్ లో మొత్తం 16 పాయింట్ లలో 13.6 పాయింట్ లను , సైడ్ ఇంపాక్ట్ లో ఫుల్ 16 పాయింట్ లను స్కోర్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా నివేదికల ప్రకారం ఫ్రంటల్ ఆఫ్సెట్ టెస్ట్ లో సివిక్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ స్థిరంగా ఉండడంతో పాటుగా, డ్రైవర్ ఛాతీకి సేఫ్టీ రేటింగ్ వీక్ అలాగే ప్యాసెంజర్ మోకాలు సేఫ్టీ బెస్ట్ ఉన్నట్లు వెల్లడించింది హోండా.
కాగా ఈ టెస్టింగ్ కోసం ఉపయోగించిన మోడల్ ఇండియాలో విక్రయించే మోడల్ కాదు. ఎందుకంటే తాజాగా పరీక్షించిన ఈ మోడల్ లో మొత్తంగా పదకొండు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా ఉన్నట్లు తెలిపింది. ఈ కారులో డ్రైవర్ తో పాటు పక్కన కూర్చుని మరొక ప్రయాణికుడికి కూడా మోకాలి ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. సైడ్ ఇంపాక్ట్ సమయంలో ఎయిర్ బ్యాగులు గాయాన్ని తగ్గించడం కోసం వెనుక సీటు ప్రయాణికుల రక్షణ కోసం ఇచ్చారు. కాగా ఇండియాలో విక్రయించే సివిక్ కారుకు కేవలం 6 ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉంటాయి.
11వ జనరేషన్ సివిక్‌లో ఫ్రంట్ డోర్ స్టిఫెనర్ లు, బ్యాక్ వీల్స్ ఆర్చ్ ఫ్రేమ్‌లు ఉంటాయి. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా కారు ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో 16కి 13, లాటరల్ ఇంపాక్ట్‌లో 16కి 16 స్కోర్ చేసింది. కొత్త సివిక్ వైడ్ 100-డిగ్రీల వ్యూ కెమెరా, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. యూరో NCAP ద్వారా గరిష్టంగా 5-స్టార్ రేటింగ్‌ను పొందిన సివిక్ సిఆర్ వి జాజ్ వంటి కార్ల ఫ్యామిలీలో హోండా చేరింది.
Related News
Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే?
ఈ ఏడాది మొదలైన తర్వాత చాలా వరకు కార్ల తయారీ సంస్థలు వాటి కార్లపై ధరలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో కార్ల