Electric Scooter: కేవలం రూ.85 వేలకే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్!
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది iVoomi.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 3 October 24

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ iVoomi భారత మార్కెట్ లోకి తాజాగా మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో iVoomi S1 లైట్‌ని పరిచయం చేసింది. పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు, మరింత మందికి చేరువయ్యేలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చింది. అయితే ఇప్పుడు కంపెనీ తన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ వేరియంట్‌లో కస్టమర్‌లు మునుపటి కంటే ఎక్కువ శ్రేణిని పొందవచ్చట.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1 లక్ష లోపే ఉంటుందని అంచనా. ఇకపోతే ఈవీ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ధర రూ. 84999 గా ఉంది. ఇందులో ఇండస్ట్రీ ఫస్ట్ ఇన్నోవేషన్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది. మీరు నగరంలో నడపడానికి గొప్ప స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పాలి. ఈ స్కూటీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 1080 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ కి సంబంధించిన డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కంపెనీకి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌లలో చాలా మంది డీలర్లు ఉన్నారు. అక్కడ నుండి మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ERW 1 గ్రేడ్ ఛాసిస్‌పై తయారు చేసింది. తద్వారా స్థిరత్వం బాగుంటుంది. దీనితో పాటు, 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చింది. తద్వారా వాహనం ఎలాంటి రోడ్లపైనైనా నడపవచ్చు. స్కూటర్‌లో 18 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. స్కూటర్‌లో 12, 10 అంగుళాల చక్రాల ఎంపిక ఉంది. ఇది కాకుండా, 5V, 1A USB పోర్ట్ అందుబాటులో ఉంది. LED డిస్‌ప్లే స్పీడోమీటర్ అందించింది కంపెనీ. ఈ స్కూటర్ లో ఇచ్చిన బ్యాటరీ IP67తో అమర్చారు. టెక్నాలజీని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు 5000 రూపాయల అదనపు ధరతో స్కూటర్‌ను స్మార్ట్ ఫీచర్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.