Tarform Luna Motorcycle: లూనా పేరుతో కొత్త ఈ బైక్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
టార్‌ఫార్మ్ ఒక ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చింది
- By Nakshatra Published Date - 12:00 PM, Sun - 1 September 24
లూనా.. చాలా మందికి ఈ పేరు వినగానే పాతకాలం నాటి స్కూటర్ ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇటీవల ఈ లోనా అనే పేరుతోనే ఒక వ్యక్తి స్కూటర్ మార్కెట్ లోకి విడుదల అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టార్ ఫార్మ్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా టార్‌ఫార్మ్ ఒక ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చింది. దీని పేరు టార్‌ఫార్మ్ లూనా. మరి తాజాగా తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ లూనా బైక్ గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం.. లూనా రెండు అవతార్ లలో అందుబాటులో ఉంది. అవి స్క్రాంబ్లర్, కేఫ్ రేసర్. ఈ రెండు మోటార్ సైకిళ్లు లుక్ పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. కానీ ఒకే విధమైన అండర్‌పిన్నింగ్ లను కలిగి ఉంటాయి. స్పెక్స్ గురించి పరిశీలిస్తే..
కాగా ఈ లూనా ఎలక్ట్రిక్ బైక్ లో 11.2కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 75పీఎస్, 60ఎన్ఎం గరిష్ట టారర్క్ ను ఉత్పత్తి చేసే ఎయిర్ కూల్డ్ మోటారును పొందుతుంది. దాదాపుగా 200 కిలోల బరువుతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 200కి.మీ వేగంతో దూసుకుపోతుంది. బ్యాటరీ నగర పరిధిలో సుమారు 160 కి.మీల పరిధిని అందిస్తుంది. 220 వాట్ల ఛార్జర్ ద్వారా కేవలం 2 గంటల్లోనే ఇది పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇక లుక్ విషయానికి వస్తే.. లూనా స్క్రాంబ్లర్ క్లాసిక్, అన్‌కవర్డ్ హెడ్‌లైట్, స్పోక్డ్ వీల్స్, ఆఫ్-రోడ్ టైర్‌లను కలిగి ఉంది. అలాగే లూనా రేసర్ ఒక సొగసైన కేఫ్ రేసర్‌ను పోలి ఉంటుంది.
ఇది హాఫ్ ఫెయిరింగ్, దృఢమైన సస్పెన్షన్, అవియాన్స్ స్పిరిట్ ఎస్టీ టైర్‌లతో కూడిన హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. డిస్క్ బ్రేకులు కలిగి ఉంటుంది. టార్‌ఫార్మ్ వారి సొంత టార్‌ఫార్మ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇది ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు, మెషిన్ లెర్నింగ్, సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, అవసరమైతే బ్రేక్‌లను వర్తింపజేయమని మీకు హెచ్చరికను అందించే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది 3.4 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లేను పొందుతుంది. టార్‌ఫార్మ్ లూనా తయారీలో కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించకుండా ఫ్లాక్స్ ఫైబర్ ను ఉపయోగించారు. ఇది మొక్కల ఆధారిత పదార్థం, ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ శక్తి అవసరం.
టార్ఫార్మ్ బాడీ పెయింట్ కోసం ఆల్గే పిగ్మెంట్ ని ఉపయోగించారు. ఇది మోటార్ సైకిల్‌పై ఇంతకు ముందు ఎన్నడూ చేయలేదు. లెదర్ సీటు కూడా నిజమైన లెదర్ తో తయారు చేయలేదు. ఇది మొక్కల వ్యర్థాల వంటి బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాల నుంచి తయారైంది. అయితే ఈ లూనా బైక్ మన దేశంలో అందుబాటులో లేదు. కేవలం యూఎస్ మార్కెట్ వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర మన కరెన్సీలో రూ. 20లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ లూనా బైక్ ని ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఇది డెలివరీ కావడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందట.
Related News
Eeva E-Scooters: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈవా-ఈ స్కూటర్లు.. ప్రత్యేకతలు ఇవే!
అరియానాకు చెందిన ఈ బైక్స్ సంస్థ తాజాగా కొన్ని ఈ స్కూటర్ లను ని మార్కెట్లోకి విడుదల చేసింది.