Upcoming Bikes: బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త బైకులు.. ఫీచర్స్ అదుర్స్?
ఇటీవల కాలంలో మార్కెట్లోకి వరుసగా పదుల సంఖ్యలో బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఏడాదికి వందల
- By Anshu Published Date - 04:30 PM, Fri - 1 September 23

ఇటీవల కాలంలో మార్కెట్లోకి వరుసగా పదుల సంఖ్యలో బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఏడాదికి వందల సంఖ్యలో కొత్త కొత్త బైకులు మార్కెట్లోకి విడుదల అవుతుండగా లక్షల సంఖ్యలో బైక్ ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఆగస్టు నెల ముగిసిన విషయం తెలిసిందే. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటి బైక్స్ మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. మరి సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి ఏఏ బైకులు విడుదల కాబోతున్నాయి వాటి వివరాలు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం మార్కెట్లోకి మూడు రకాల బైక్లు విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310… టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కకాకుండా చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందో. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదల కాబోతున్నట్లు సమాచారం.
2024 కేటీఎమ్ 390 డ్యూక్.. నేటి యువత ఎంతగానో ఇష్టపడే కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందట.
సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ… సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.