Electric Scooters: ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?
ఇటీవల కాలంలో భారత దేశంలో ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ బైకులు స్కూట
- By Anshu Published Date - 04:40 PM, Thu - 13 June 24

ఇటీవల కాలంలో భారత దేశంలో ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ బైకులు స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల బైక్లు స్కూటర్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. చాలామంది ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడితే మరికొందరు తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగిన స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు.
మరి ఇండియాలో లక్ష కంటే తక్కువ ధరకే లభిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఓలా ఎస్1 ఎక్స్ ప్రదరి స్థానంలో ఉంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభ దశ నుంచి ఇప్పటివరకు తక్కువ ధరకే మంచి మంచి వాహనాలను అందిస్తూ కస్టమర్ల దృష్టిని బాగా ఆకర్షిస్తూ వస్తోంది. ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధిస్తోంది. కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైకుల జాబితాలో ఎస్1 ఎక్స్ కూడా ఒకటి. దీని ధర కేవలం రూ.69999 మాత్రమే. ఈ ఓలా ఎస్1 ఎక్స్ ఓలా ఎస్1 ఎక్స్ యొక్క 2 కిలోవాట్ బ్యాటరీ 9 కిమీ రేంజ్, 3 కిలోవాట్ బ్యాటరీ 143 నుంచి 151 కిమీ రేంజ్ అందిస్తుంది.
ఇక 4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 190 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 ఇంచెస్ లేదా 4.3 ఇంచెస్ డిస్‌ప్లే పొందుతుంది. అంతే కాకూండా కీలెస్ ఇగ్నిషన్, స్మార్ట్ కనెక్టివిటీ, 34 లీటర్ అండర్ బూట్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి కూడా ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తాయి. ఇది 6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ స్కూటర్ ఉంది. దీని ధర కేవలం రూ. 77999 మాత్రమే. ఇది 2.4 కిలోవాట్ ఎంసీయూ టెక్నలజీతో 1.5 కిలోవాట్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 111 కిమీ నుంచి 151 కిమీ పరిధిని అందిస్తుంది. తక్కువ ధరకే లభిస్తున్న స్కూటర్లలో బజాజ్ చేతక్ 2901 కూడా ఒకటి. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95999 మాత్రమే.
ఇందులోని 2.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 123 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 63 కిమీ. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, డిజిటర్ స్క్రీన్, మ్యూజిక్ కంట్రోల్స్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అలాగే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ స్కూటర్ ధర రూ. 94900 గా ఉందీ. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఉత్తమ్ మోడల్. ఇది 2.2 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 53 కిమీ మాత్రమే. ఇది కేవలం 10 సెకన్లలో 40 కిమీ వేగవంతం అవుతుంది.