Maruti Suzuki Eeco : అతి తక్కువ ధరలో 7 సీటర్ కారు కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? అయితే ఇది మీకోసమే !
Maruti Suzuki Eeco : భారతీయ మార్కెట్‌లో Maruti Suzuki Eeco అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 7 సీటర్ కారు అని పేరు సంపాదించుకుంది. ఆగస్టు 2025లో కూడా దీని డిమాండ్ తగ్గకపోవడం దీనికి నిదర్శనం
- By Sudheer Published Date - 10:33 AM, Wed - 3 September 25

భారతీయ మార్కెట్‌లో Maruti Suzuki Eeco అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 7 సీటర్ కారు అని పేరు సంపాదించుకుంది. ఆగస్టు 2025లో కూడా దీని డిమాండ్ తగ్గకపోవడం దీనికి నిదర్శనం. కేవలం ఒక్క నెలలోనే 10,785 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా ఈ మోడల్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. కుటుంబ వినియోగదారులు మాత్రమే కాకుండా వాణిజ్య రంగంలో కూడా ఈకో మొదటి ఎంపికగా నిలుస్తోంది. తక్కువ ధర, పెద్ద స్పేస్, మంచి మైలేజ్ కారణంగా ప్రతి తరగతి ప్రజలు దీన్ని ఆహ్వానిస్తున్నారు.
Trump: ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో గట్టి దెబ్బ
ఈకోలో 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ VVT పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 18.76 bhp పవర్, 104 Nm టార్క్ ఇస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే పెట్రోల్ వేరియంట్ 19.71 kmpl, CNG వేరియంట్ 26.78 km/kg వరకు ఇస్తుంది. తక్కువ ఇంధన వినియోగం వల్లే ఇది టాక్సీ యజమానులు, వాణిజ్య వినియోగదారులకు మరింత ఆదరణ పొందుతోంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS-EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్లైడింగ్ డోర్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ధర పరంగా చూస్తే ఈకో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.6.96 లక్షల వరకు ఉంటుంది. 13 వేరియంట్‌లు, 5 కలర్ ఆప్షన్‌లలో ఇది లభిస్తోంది. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర రూ.6.86 లక్షల వరకు ఉండగా, సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు సుమారు రూ.11,500 చెల్లింపుతో ఈకోను సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఈకో నిజంగా బెస్ట్ ఆప్షన్‌గా కొనసాగుతోంది.