WagonR Loses One Feature : “వ్యాగన్ ఆర్” నుంచి ఒక ఫీచర్ ను తీసేసిన మారుతీ సుజుకీ
WagonR Loses One Feature : కార్ల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.. దీంతో కార్ల ఉత్పత్తి కాస్ట్ పెరుగుతూపోతోంది.. ఈనేపథ్యంలో కార్ల ధరలను మరింత పెంచలేక.. ఫీచర్స్ ను తగ్గిస్తోంది మారుతీ సుజుకీ.
- By Pasha Published Date - 10:29 AM, Mon - 24 July 23

WagonR Loses One Feature : కార్ల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి..
దీంతో కార్ల ఉత్పత్తి కాస్ట్ పెరుగుతూపోతోంది..
ఈనేపథ్యంలో కార్ల ధరలను మరింత పెంచలేక.. ఫీచర్స్ ను తగ్గిస్తోంది మారుతీ సుజుకీ.
మారుతీ సుజుకీ చెందిన పలు కార్ల వేరియంట్లలో ఫీచర్స్ తగ్గుతున్నాయి. ఇటీవల Brezza (బ్రెజా) కారు CNG వర్షన్ లోని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ ను తీసేసిన మారుతీ సుజుకీ .. తాజాగా WagonR (వ్యాగన్ ఆర్) కారు నుంచి ఒక ఫీచర్‌ను తగ్గించింది. ఈ కారు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలోని హయ్యర్ వేరియంట్ వర్షన్ల నుంచి డీఫాగర్ ను తొలగించింది. దీంతో ఇకపై WagonR ZXi ప్లస్ వేరియంట్ కార్ల వెనుక భాగంలోని రేర్ డీఫాగర్ ( rear defogger) కనిపించదు. ఈ ఫీచర్ ను తొలగించినా దాని ధరను తగ్గించలేదు.
Also read : Stop Eating Tomatoes : టమాటాలు తినడం మానేయమంటున్న బీజేపీ మంత్రి..
WagonR ZXi ప్లస్ వేరియంట్ ధర రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.42 లక్షల వరకు ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫోర్ వే స్పీకర్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సర్లు, హిల్-హోల్డ్ అసిస్ట్ (AMT మాత్రమే), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డీఫాగర్ అనేది కారు వెనుక ఉండే విండ్‌స్క్రీన్ పై పేరుకుపోయిన పొగమంచును, నీటిని తుడవడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో, వర్షాకాలంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. డీఫాగర్ విండ్‌షీల్డ్‌ను వేడి చేసి.. అద్దంపై పేరుకుపోయిన తేమను తుడుస్తుంది.
Also read : Ashwin-Jadeja: 49 టెస్టుల్లోనే 500 వికెట్లు.. రెండో ప్రమాదకర జోడీగా ఆశ్విన్-జడేజా..!