Mahindra SUV Cars: మహీంద్రా స్కార్పియో- మహేంద్ర థార్.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసా?
ప్రస్తుతం మార్కెట్ లో మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ కార్లు పోటా పోటీగా నిలుస్తున్నాయి.
- By Anshu Published Date - 12:00 PM, Thu - 22 August 24

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎన్నో రకాల కార్లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వివిధ కంపెనీలకు చెందిన కార్లు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ నేపథ్యంలోని కొన్ని కొన్ని కార్లు మార్కెట్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అలా ప్రస్తుతం మార్కెట్లో రెండు కార్లు ఒకదానికి ఒకటి పోటీగా నిలుస్తున్నాయి. ఆ కార్లు ఏవో కాదు మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్. మరి ఈ రెండు కార్లకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా థార్ రాక్స్ రెండూ పవర్ ఫుల్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లోకే వస్తాయి. ఈ రెండింటి లోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
రెండింటి బేసిక్ మోడల్ ధరలో మాత్రం తేడా ఉంటుంది. చాలా మంది బేసిక్ మోడల్ కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. అసలు ఈ రెండింటీ మద్య తేడా ఏంటి అన్న విషయానికి వస్తే.. మహీంద్ర స్కార్పియో ఎన్ బేసిక్ మోడల్ అంటే జెడ్ 2 పెట్రోల్ ఇంజన్ ఎస్‌యూవీ. ఇందులో 5 సీటర్, 7 సీటర్ రెండూ ఉంటాయి. ఇందులో ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. బేసిక్ మోడల్ కారణంగా ప్రీమియం మోడల్ ఫీచర్లు ఉండవు. తక్కువ బడ్జెట్ లో పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కొనాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక మహీంద్రా థార్ రాక్స్ విషయానికి వస్తే.. ఈ బేసిక్ మోడల్‌లో ఎంఎక్స్ఐ అనేది పెట్రోల్ ఇంజన్.
ఇందులో 5 సీటర్ ఉంది. ఈ మోడల్ కూడా తక్కువ దరకే సొంతం చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ కావడంతో హై ఎండ్ కార్లలో ఉండే ఫీచర్లు ఉండకపోవచ్చు. కానీ తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్ ఇది. పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కోసం అణ్వేషిస్తుంటే బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇక వీటి ధరల విషయానికొస్తే.. మహింద్రా స్కార్పియో ఎన్ బేసిక్ వేరియంట్ జెడ్ 2 పెట్రోల్ ధర 14 లక్షల 35 వేల 199 రూపాయలుగా ఉంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. ఇక మహీంద్రా థార్ రాక్స్ బేసిక్ మోడల్ ఎంఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ ధర 12 లక్షల 99 వేలుగా ఉంది.