SUV: జీప్ అవెంజర్ ఎలక్ట్రిక్ ఎస్యూవి..ఫీచర్స్ ప్రత్యేకతలు ఇవే?
అమెరికన్ ఎస్యూవి కార్ల తయారీ కంపెనీ అయిన జీప్ అవెంజర్ బ్రాండ్ తాజాగా మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవి
- By Nakshatra Published Date - 04:53 PM, Fri - 21 October 22
అమెరికన్ ఎస్యూవి కార్ల తయారీ కంపెనీ అయిన జీప్ అవెంజర్ బ్రాండ్ తాజాగా మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవి అవెంజర్ను పరిచయం చేసింది. e-CMP ప్లాట్‌ఫారమ్ కంపెనీ మొదటి ఆఫ్ రోడ్ కెపాబిలిటీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవిలో ఉపయోగించరు. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవి రేంజ్ అండ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ జీప్ అవెంజర్ ఎలక్ట్రిక్ ఎస్యూవి కార్ లో 54KWH బ్యాటరీని కంపెనీ అందించింది. ఈ బ్యాటరీ తో ఎస్యూవి WLTP పరిధి 400 కి.మీ. 550 కి.మీ వరకు పొడిగించవచ్చు. కాగా ఇందులో ఉపయోగించిన మోటార్ ఎస్యూవి 156 పిఎస్ అండ్ 260 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది.
అయితే దీని బ్యాటరీని 11 kW ఛార్జర్‌తో 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. 100 kW ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 24 నిమిషాల్లో దాదాపు 80% వరకు చార్జ్ అవుతుంది. ఈ ఎస్‌యూవిలో ఇంటిగ్రేటెడ్ హారిజాంటల్ డిఆర్ఎల్ అండ్ స్క్వేర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎస్యూవి అన్ని డోర్స్ అండ్ బంపర్లపై బ్లాక్ క్లాడింగ్ ఇచ్చారు ఇంకా రెండు బంపర్లపై సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్లు కూడా ఇచ్చారు. అవెంజర్ ఎలక్ట్రిక్ ఇంటీరియర్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఎస్యూవి ఇంటీరియర్‌లో పసుపు రంగును ఉపయోగించింది.
7 అంగుళాల MID కాకుండా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇకపోతే ఫీచర్ల విషయానికి వస్తే..పవర్ టెయిల్‌గేట్, సన్‌రూఫ్,వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్, యాంబియంట్ లైటింగ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఈ ఎస్యూవి లో ఉన్నాయి. అదేవిధంగా సెక్యూరిటి కోసం 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, లేన్ సెంటరింగ్, అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, , ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, ట్రాఫిక్ జామ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఎస్‌యూవిలో అందించారు. ఇందులో కార్ లోని సీట్ల కింద బ్యాటరీలను ఇచ్చారు.
Related News
Driving License: రెండు చేతులు కోల్పోయిన యువకుడికి లైసెన్స్
రెండు చేతులు కోల్పోయిన తమిళనాడు యువకుడు కారు నడిపేందుకు లైసెన్స్ పొంది రికార్డు సృష్టించాడు. తాన్సేన్ (31) చెన్నై వ్యాసర్పాడి పెరియార్‌కు చెందినవాడు. పదేళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.