Hyundai: ఆ కంపెనీ కార్లకు పోటీగా హ్యుందాయ్ కొత్త ఎస్యూవి.. విడుదల ఎప్పుడంటే?
దక్షిణ కొరియా కార్ల కంపెనీ అయిన హ్యుందాయ్ మార్కెట్లోకి ఎస్యూవీ ని తీసుకువచ్చేందుకు భారీగా సన్నాహాలు సిద్ధం
- By Nakshatra Published Date - 04:58 PM, Sat - 19 November 22
దక్షిణ కొరియా కార్ల కంపెనీ అయిన హ్యుందాయ్ మార్కెట్లోకి ఎస్యూవీ ని తీసుకువచ్చేందుకు భారీగా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కొత్త ఎస్యూవీ కారు 4 మీటర్ల కంటే తక్కువ సైజులో ఉండబోతోంది. అంతేకాకుండా ఈ కారు టాటా, మారుతి లాంటి కంపెనీ కార్లతో పోటీగా నిలువబోతోంది. ఇదిగా ఉంటే తాజాగా అందిన నివేదికల ప్రకారం హ్యుందాయ్ సంస్థ మార్కెట్ లోకి త్వరలోనే మరొక కొత్త ఎస్యూవి కారును ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ సరికొత్త కారు నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉండడంతో పాటు పవర్ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకునే లుక్ తో రానుంది. హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త కారుకి AI3 అనే కోడ్‌నేమ్ కూడ ఇచ్చింది.
అయితే, లాంచ్ సమయంలో దీని పేరు ఏంటి అనే దాని పై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇకపోతే ఈ సరికొత్త AI3 ఎస్యూవి కార్ ఎప్పుడు వస్తుంది అన్నా విషయానికి వస్తే.. హ్యుందాయ్ నుండి కొత్త ఎస్యూవి వచ్చే ఏడాది అనగా 2023 ఫెస్టివల్ సీజన్‌లోపు భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. కానీ జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టవచ్చు. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించబోతున్నాయి. ఇకపోతే ఈ హ్యుందాయ్ AI3 ఎస్యూవి కార్ ఇంజిన్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే.. చిన్న ఎస్‌యూవిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించనుంది. ఈ ఇంజన్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్ ఐ 10 నియోస్ లో అందించారు.
దీనితో పాటు టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చే అవకాశం. కంపెనీ కొత్త ఎస్యూవి ని ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అందించవచ్చు. ఇకపోతే ప్రస్తుతం భారత మార్కెట్ లో ఎస్యూవీ సెగ్మెంట్ కు అధిక డిమాండ్ ఉండడంతో ఈ సెగ్మెంట్లోని చాలా రకాల స్పెషాలిటీలను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ ఎస్యూవి భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న టాటా పంచ్ అండ్ మారుతి S Preso వంటి వంటి కార్లకు పోటీగా నిలవనుంది. దీనితో పాటు ఈ ఎస్యూవి రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్‌లను కూడా పోటీగా నిలుస్తుంది.
Related News
Malavika Mohanan : సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ పరువు తీసేశారుగా..?
Malavika Mohanan మలయాళ భామ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తుందని తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ