Hyundai i20: హ్యూందాయ్ ఐ20పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ అవకాశం అప్పటివరకు మాత్రమే!
హ్యూందాయ్ సంస్థ ఐ20 కారు పై అదిరిపోయే డిస్కౌంట్ ని అందిస్తోంది.
- By Nakshatra Published Date - 11:30 AM, Fri - 30 August 24
మార్కెట్లో హ్యూందాయ్ కార్లకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన కార్లపై బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. అందులో భాగంగానే హ్యూందాయ్ ఐ 20 కారుపై కళ్ళు చెదిరే ఆఫర్ ని అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. పండుగ సీజన్ వచ్చింది అంటే చాలు హ్యూందాయ్ కంపెనీ వివిధ కార్లపై ప్రత్యేక తగ్గింపు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ డిస్కౌంట్ అనేది అన్ని మోడల్ కార్లపై ఒకేలా ఉండదు. కారు మోడల్ ని బట్టి డిస్కౌంట్ మారుతూ ఉంటుంది.
హ్యూందాయ్ ఐ20 పై సదరు కంపెనీ క్యాష్ డిస్కౌంట్ 35 వేలు ఇస్తోంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో 10 వేలు లభిస్తుంది. అంటే మొత్తం 45 వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది. అంటే ఈ కార్ ను కొనుగోలు చేసే వారు 45 వేల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఇకపోతే ఈ హ్యూందాయ్ ఐ20 కారు ఫీచర్లు స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. హ్యూందాయ్ ఐ20లో 40కు పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 26 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా ఉంటాయి. మిగిలినవి మోడల్ ను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. స్టాండర్డ్ సేఫ్టీ ప్యాక్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
హ్యూందాయ్ ఐ 20లో మేన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ వేరియెబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొత్తగా ఐడియల్ స్టాప్ అండ్ గో ఫీచర్ వచ్చి చేరింది. దాంతో మైలేజ్ మరింతగా పెరుగుతుంది. హ్యూందాయ్ ఐ20 పోటీ మార్కెట్ లో మారుతి బలేనో, టాటా ఆల్ట్రోజ్ తో ఉంది. అయితే ఈ ఆఫర్ కు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈ కారణం కొనుగోలు చేయాలి అనుకున్న వారు వెంటనే సమీపంలోని షో రూమ్ ని విజిట్ చేయడం మంచిది.