Hero Mavrick 440: భారత మార్కెట్ లోకి హీరో మేవ్రిక్ 440 స్పోర్ట్స్ బైక్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కమ్యూటర్ బైక్స
- By Nakshatra Published Date - 05:00 PM, Fri - 16 February 24
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కమ్యూటర్ బైక్స్ మాత్రమే కాకుండా అడ్వెంచర్, స్పోర్ట్స్ మోటార్‌సైకిల్స్ కూడా తయారు చేస్తోంది మోటోకార్ప్ పవర్ఫుల్ టూవీలర్స్‌కు మార్కెట్లో మంచి క్రేజ్ లభిస్తోంది. కాగా మోటోకార్ప్ ఇటీవల కొన్ని నెలల క్రితం మేవ్రిక్ 440 పేరుతో ఒక సూపర్ బైక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. హీరో వరల్డ్ ఈవెంట్లో భాగంగా ఈ బైక్ ని పరిచయం చేసింది మోటోకార్ప్.
అయితే హీరో కంపెనీ ఇప్పటి వరకు తయారు చేసిన అన్ని టూవీలర్లలో ఇదే అత్యంత ఖరీదైనది కావడం విశేషం. మరి ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అయితే ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చిన ఈ రోడ్‌స్టర్ బైక్, క్లాసిక్ అమెరికన్ క్రూయిజర్ హార్లే-డేవిడ్సన్ X440 నుంచి ప్రేరణ పొందింది. మేవ్రిక్ రౌండ్ LED హెడ్‌లైట్, DRLs, స్లిమ్ ఇన్డికేటర్స్, మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు దీనిపైనే ఉండేలా సరికొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ బేస్, మైల్డ్, టాప్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవన్నీ సింగిల్ సీట్ కాన్ఫిగరేషన్‌తో వస్తాయి. ఈ కాన్ఫిగరేషన్ రైడర్, పిలియన్ ఇద్దరికీ లాంగ్ రైడ్స్‌లో సౌకర్యాన్ని అందిస్తుంది.
వెహికల్లో బ్లూటూత్-ఎనేబుల్డ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో బైక్ స్పీడ్, RPM, ఫ్యూయల్ లెవెల్, గేర్ పొజిషన్, సమయం వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. హీరో మేవ్రిక్ 440 బైక్‌లో 440cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ టార్క్ఎక్స్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27.36 PS పవర్, 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. బేస్ వేరియంట్ పై కర్బ్ వెయిట్ 191కిలోలు, మిడ్, టాప్ వేరియంట్ 187కిలోలు ఉంటాయి. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉంది. ఫ్రంట్ వీల్ 320mm డిస్క్, వెనుక వీల్ 240 mm డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ టూవీలర్‌కు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. బైక్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఈ-సిమ్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ & SMS అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ ఇండికేటర్, రిమోట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఆఫర్ చేస్తుంది. బైక్ వీల్‌బేస్ 1,345 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm, సీట్ ఎత్తు 803 మిమీ.
మేవ్రిక్ భారతీయ మార్కెట్లోని హార్లే-డేవిడ్సన్ 440x, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్, హోండా హెచ్నెస్ వంటి ఇతర ప్రీమియం రోడ్‌స్టర్ మోటార్ సైకిల్స్‌తో పోటీపడుతుంది. ఈ బైక్ ధర రూ.1.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.2.24 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే వెల్కమ్ టు మేవ్రిక్ క్లబ్ ఆఫర్ కింద మార్చి 15లోపు ఈ మేవ్రిక్ 440 టూవీలర్‌ను బుక్ చేసుకుంటే రూ.10,000 విలువైన మేవ్రిక్ కాంప్లిమెంటరీ కిట్ ఉచితంగా పొందవచ్చట. కాగా ఈ బైక్ ధర తెలిసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. నిజంగానే ఇది అత్యంత కాస్ట్లీ బైక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.