Affordable EV Scooters: తక్కువ ధరలో అధిక మైలేజ్‌ను ఇచ్చే ది బెస్ట్ ఈవీ స్కూటర్స్.. ఒక లుక్కేయండి?
ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ ల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా టూ వీలర్స్ విభాగంలో ఈవీ స్కూటర్లు వినియోగదాలన
- By Nakshatra Published Date - 06:48 AM, Tue - 11 June 24
![Affordable EV Scooters: తక్కువ ధరలో అధిక మైలేజ్‌ను ఇచ్చే ది బెస్ట్ ఈవీ స్కూటర్స్.. ఒక లుక్కేయండి?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-11-Jun-2024-06-47-AM-8694.jpg)
ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ ల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా టూ వీలర్స్ విభాగంలో ఈవీ స్కూటర్లు వినియోగదాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాను రాను ఈ ఈవీ స్కూటర్ల వాడకం అలాగే వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో తక్కువ ధరలోనే అధిక మైలేజ్‌ను ఇచ్చే టాప్-5 ఈవీ స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఓలా ఎస్1 ఎక్స్ ను ఇండియా లోని రసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది 190 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది.
ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్ రూ. 99,999 ga ఉంది. ఎస్ 1 ఎక్స్ 4 కేడబ్లూహెచ్ బ్యాటరీ, హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. 90 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో ఈ-స్కూటర్ 0-60 కేఎంపీహెచ్ నుంచి 5.5 సెకన్లలో దూసుకుపోతుంది. అలాగే మరో ఈవీ స్కూటర్ విషయానికి వస్తే.. బజాజ్ ఆటో భారతదేశంలో అత్యంత సరసమైన చేతక్ 2901 ఈ-స్కూటర్‌ను రూ. 95,999 తో విడుదల చేసింది. ఈ కొత్త చేతక్ స్పెషల్ ఎడిషన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీల ఏఆర్ఏఐ ధ్రువీకరించిన పరిధిని అందిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్ వంటి మంచి మంచి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
అదేవిధంగా రెట్రో స్టైలింగ్‌ను అనుసరించి ప్యూర్ ఈవీ ప్లూటో 7జీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 92,999 గా ఉంది. ఈ స్కూటర్లో 2.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, హబ్ మౌంటెడ్ బీఎల్డీసీ మోటార్ అమర్చారు. ఈ స్కూటర్ 111 కి.మీ, 151 కి.మీ మధ్య మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే 72 కి.మీ గరిష్ట వేగంతో వెళ్తుంది. అదేవిధంగా రూ. 94,900 ధరకే లభించే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక ఛార్జ్‌కి 100 కిమీ కంటే ఎక్కువ సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 సెకన్ల మధ్య 0-40 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 53 కి.మీగా చెప్పవచ్చు. అలాగే . 97,256 ధర వద్ద లబించే కొమాకీ ఎస్ఈ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్‌కి 95-100 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. 3 కేడబ్ల్యూ బీఎల్డీసీ మోటార్‌తో వచ్చే ఈ హై-స్పీడ్ ఈ -స్కూటర్ మూడు రైడ్ మోడ్లు అంటే ఎకో, టర్బో, స్పోర్ట్ మోడ్లు అందుబాటులో ఉంటాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![GT Texa E-Bike: మార్కెట్ లోకి విడుదలైన మరో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-29-Jun-2024-07-11-PM-8001.jpg)
GT Texa E-Bike: మార్కెట్ లోకి విడుదలైన మరో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్?
మార్కెట్లోకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా మద్ద