Cars Waiting Period: అయ్య బాబోయ్ ఈ 5 కార్లకు ఇంత డిమాండా.. కొనాలంటే వెయిట్ చేయాల్సిందే!
మార్కెట్ లో ఉన్న ఈ టాప్ 5 కార్లు చాలా ఎక్స్పెన్సివ్. వీటిని కొనుగోలు చేయాలి అంటే కొన్ని నెలలు లేదా వారాలు వేచి చూడాల్సిందే.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 2 August 24

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కార్లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ కార్లు కూడా ఉన్నాయి. ఆ కార్లను కొనాలి అంటే వెయిట్ చేయక తప్పదు అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఆ కార్లు ఏవి? వాటికీ ఎందుకు అంత డిమాండో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటి స్థానంలో ఉంది టయోటా వాహనం. ఈ కారుకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కాగా ఈ హైబ్రిడ్ కారు వెయిటింగ్ పీరియడ్ 13 నెలలకు చేరుకుంది. అంటే మీరు ఈ కారును ఈరోజే బుక్ చేసుకుంటే దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత ఈ కారు డెలివరీ అవుతుందంటే ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.
ఇందులో రెండవ స్థానంలో టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. కాకా మీరు కనుక ఈ కారణం కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజే టొయోటా ఇన్నోవా క్రిస్టాను బుక్ చేసుకుంటే మీరు ఐదు నెలల వరకు వేచి ఉండాల్సిందేనట. అంటే ఈ కారు యొక్క వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలలు. అలాగే మీరు టాటా పంచ్ కారును కొనుగోలు చేయాలి అనుకుంటే రెండు నుంచి మూడు నెలలు వెయిటింగ్ చేయక తప్పదు అంటున్నారు. కాగా టాటా మోటార్స్ ఈ SUVకి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఈ SUV కోసం 2 నుండి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. హ్యుందాయ్ ఆరా కారు కూడా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఒకవేళ మీరు ఈ హుందాయి కారణం కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు బుక్ చేసుకుంటే దాదాపు 6 నుంచి 8 వారాలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది.
పెట్రోల్ లేదా సీఎన్జీ వేరియంట్ వాహనాల కోసం ఒకటి నుంచి రెండు వారాలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఐదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా కారు ఉంది. మీరు పెట్రోల్ డీజిల్ ఆటో వేరియంట్ లకు 4 నుండి 6 వారాలు, టర్బో ఇంజిన్ పెట్రోల్ ఆటో వేరియంట్ లకు 8 నుండి 10 వారాలు వేచి చూడాల్సిందే. అలాగే క్రెటా ఎన్ లైన్ యొక్క పెట్రోల్, ఆటో వేరియంట్‌ల కోసం 8 నుండి 10 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుందట.