BYD ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయోచ్..ఫీచర్లు మాములుగా లేవు
BYD : BYD కొత్తగా మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ అనే అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ చేయగల ఈ టెక్నాలజీతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగల సామర్థ్యం ఉంది
- By Sudheer Published Date - 04:34 PM, Wed - 26 March 25

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న చైనా కంపెనీ BYD (BYD Cars) త్వరలో తెలంగాణలో తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్(Hyderabad)లో ఈ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరియు BYD మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ
BYD ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను భారత్‌కు దిగుమతి చేసి విక్రయిస్తోంది. అధిక దిగుమతి సుంకాల కారణంగా కార్ల ధరలు ఎక్కువగా ఉండటంతో, భారత మార్కెట్లో పెద్ద స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోతోంది. అయితే హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల వాహన ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు విస్తరిస్తాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కోసం మూడు ప్రాంతాలను పరిశీలించారని, త్వరలో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం.
Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధించేందుకు సిట్ ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
BYD కొత్తగా మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ అనే అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ చేయగల ఈ టెక్నాలజీతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగల సామర్థ్యం ఉంది. అంతేకాక సంస్థ 20 గిగావాట్ బ్యాటరీ ప్లాంట్‌ను కూడా స్థాపించాలని చూస్తోంది. BYD గత ఏడాది తన అమ్మకాలను 40% పెంచుకుని, 107 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది టెస్లాను కూడా అధిగమించేలా ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని వేగవంతం చేసే దిశగా, హైదరాబాద్‌లో BYD ప్లాంట్ కీలక భూమిక పోషించనుంది.