Bike Ride: బైక్‌లో ఆ భాగం ఎందుకంత ముఖ్యమో, ఉపయోగం ఏంటో తెలుసా?
మాములుగా బైక్ లో ఎన్నో రకాల సురక్షితమైన, ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అటువంటి వాటిలో సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. సస్పెన్షన్ సిస్టమ్ పని బైక్ షాక్ లను గ్రహించడమే.
- By Anshu Published Date - 05:12 PM, Sat - 13 July 24

మాములుగా బైక్ లో ఎన్నో రకాల సురక్షితమైన, ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అటువంటి వాటిలో సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. సస్పెన్షన్ సిస్టమ్ పని బైక్ షాక్ లను గ్రహించడమే. ఈ ముఖ్యమైన భాగం కారణంగా గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డుపై కూడా బైక్ నడపడం సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ బైక్ లో సస్పెన్సన్ సిస్టమ్ గనుక లేకపోతే ఎలాంటి రహదారి రైడర్ కు అయిన సరే అసౌకర్యంగా ఉంటుంది. అలాగే రైడింగ్ ఆనందాన్ని కూడా పూర్తిగా పాడు చేస్తుంది.
ఈ కారణంగా, అడ్వెంచర్ బైక్ లలో సస్పెన్షన్ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ లను కొండలు కఠినమైన రోడ్లపై ప్రయాణించేలా చేస్తారు. ఇకపోతే బైక్ లో ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఇది బైక్ ఫ్రంట్ వీల్ కోసం. దీనిని టెలిస్కోపిక్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు. ఇక వెనుక సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఇది బైక్ వెనుక చక్రానికి సంబంధించినది. దీనిని మోనోషాక్ లేదా డ్యూయల్ షాక్ అని కూడా పిలుస్తారు. ఈ సస్పెన్షన్ సిస్టమ్ లు బైక్ హ్యాండ్లింగ్, స్థిరత్వం, సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కఠినమైన రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ఉంటాయి.
ఇకపోతే సస్పెన్షన్ ను ఎలా నిర్వహించాలి? అన్న విషయానికి వస్తే.. సస్పెన్షన్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రత్యేకించి మీరు అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై ప్రయాణించినట్లయితే సస్పెన్షన్ లో లీక్‌ల కోసం క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఎందుకంటే ఇది పనితీరును తగ్గిస్తుంది. మీ బరువు, రైడింగ్ అవసరాలకు అనుగుణంగా సస్పెన్షన్ ను సరిగ్గా సర్దుబాటు చేయాలి. అదేవిధంగా సస్పెన్షన్ రోడ్డు లోపాలు, గుంతలు, ఇతర అడ్డంకులను గ్రహిస్తుంది. రైడ్ ను మరింత సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా చేస్తుంది.