Auto Bikes: బజాజ్ ప్లాటినా,హోండా షైన్.. ఈ రెండింటిలో ఏది బెటర్.. పూర్తి వివరాలు ఇవే!
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బజాజ్ ప్లాటినా హోండా షైన్ బైక్స్ లో ఏది మంచిది? వాటి ధర పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:33 AM, Thu - 2 January 25

మామూలుగా బైక్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారు మార్కెట్లో ఉన్న బైక్స్ లో ఏది కొనుగోలు చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో బజాజ్ ప్లాటినా అలాగే హోండా షైన్ బైక్స్ కూడా ఒకటి. ఈ బైక్స్ కు కూడా బాగానే డిమాండ్ ఉంది. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ రెండు రకాల బైక్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ రెండు రకాల బైక్స్ లో ఏ బైక్ అత్యధిక మైలేజ్ ను అందిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే వాటి ధర వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందులో ముందుగా బజాజ్ ప్లాటినా బైక్ విషయానికి వస్తే.. బజాజ్ ప్లాటినా 100 లో కంపెనీ 102 సీసీ ఇంజన్ ని అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 PS పవర్‌తో 8.3 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్ లో డ్రమ్ బ్రేక్ లు అందించింది. దీనితో పాటు, 11 లీటర్ ఇంధన ట్యాంక్ కూడా ఉంది. DRL, స్పీడో మీటర్, ఫ్యూయల్ గేజ్, టాకో మీటర్, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బైక్ లో కనిపిస్తాయి.
ఇకపోతే హోండా షైన్ విషయానికి వస్తే..ఈ బైక్ లో 123.94 సిసి, 4 స్ట్రోక్, ఎస్‌ఐ, బిఎస్ VI ఇంజన్ ని అమర్చారు. ఈ ఇంజన్ 7,500 rpm వద్ద 7.9 kW శక్తిని అందిస్తుంది. 6,000 rpm వద్ద 11 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్ కూడా అనుబంధించి ఉంది. ఈ బైక్ ఐదు రంగుల ఆప్షన్ లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అన్న విషయానికి వస్తే.. బజాజ్ ప్లాటినా 100 అత్యధిక మైలేజ్ బైక్ లలో ఒకటిగా పరిగణిస్తారు. బజాజ్ ప్లాటినా 100 మైలేజ్ లీటరుకు 72 కిలో మీటర్లు అని కంపెనీ తెలిపింది. హోండా షైన్ 55 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఈ బైక్ ఒక్కసారిగా ట్యాంక్ ను నింపడం ద్వారా 550 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు.