Bajaj Chetak: మార్కెట్లోకి బజాజ్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే!
మార్కెట్లోకి తాజాగా మరో బజాజ్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది..
- By Nakshatra Published Date - 12:00 PM, Thu - 5 September 24
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల వాహనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాటితో పాటు కొత్త కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇటీవలే బజాజ్ చేతక్ బ్లూ 3202 పేరుతో ఒకసారి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మరి తాజాగా తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.15 లక్షలుగా ఉంది.చేతక్ ప్రీమియం ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.47 లక్షలు.
ఇది పూర్తి ఛార్జీపై 126 కి.మీ. చేతక్ బ్లూ 3202 అథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మరియు హీరో విడా వి1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. అయితే దీనిపై గతంలో కంటే రూ.8 వేలు తగ్గింది. కొత్త చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మ్యాట్ కోర్స్ గ్రే వంటి నాలుగు కలర్ ఆప్షన్ లలో కొనుగోలు చేయవచ్చు. బజాజ్ చేతక్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీరు రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చట. కాగా ఈ బజాజ్ చేతక్ బ్లూ 3202 వేరియంట్ ప్రీమియం వేరియంట్ లాగా 3.2 kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే చాలు 137 కిలో.మీటర్లు ప్రయాణిస్తుంది.
బ్లూ 3202 వేరియంట్ లో ఉన్న కొత్త బ్యాటరీ సెల్ కారణంగా మీరు మునుపటి కంటే మెరుగైన శ్రేణి ప్రయోజనాన్ని పొందుతారు. దీని గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ఇతర వేరియంట్ల మాదిరిగానే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడిగా చెల్లించి టెక్‌ప్యాక్ ప్యాకేజీతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో హిల్ హోల్డ్ అసిస్టెన్స్, రోల్-ఓవర్ డిటెక్షన్, ప్రత్యేక రైడింగ్ మోడ్లు స్పోర్ట్, క్రాల్ వంటి ఎంపిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ వేరియంట్లో అందించబడిన ఇతర ఫీచర్లలో LED DRLతో కూడిన LED హెడ్లైట్లు, USB ఛార్జింగ్ పోర్ట్, ఓవర్ ది ఎయిర్ అప్డేట్ లతో బజాజ్ యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.