Bajaj Auto CNG bikes: మార్కెట్ లోకి రాబోతున్న బజాజ్ ఆటో సీఎన్జీ బైక్స్.. లాంచింగ్ డేట్ అప్పుడే?
దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఇప్పటికే పలు రకాల బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొ
- By Nakshatra Published Date - 03:30 PM, Fri - 2 February 24
దేశంలో అతిపెద్ద బైక్స్ తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఇప్పటికే పలు రకాల బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్తగా మార్కెట్ లోకి సీఎన్జీ మోటార్‌సైకిల్స్‌ని లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటోంది బజాజ్ ఆటో. అయితే ఈ సీఎన్జీ బైక్స్ 2025 ఆర్థిక ఏడాదిలో మార్కెట్లోకి అడుగుపెడతాయని సమాచారం. ఈ బైక్స్ అటు పెట్రోల్‌తో పాటు ఇటు సీఎన్జీ పైనా నడుస్తాయట. ఈ నేపథ్యంలో ఈ బజాజ్ ఆటో సీఎన్జీ బైక్స్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. 3 వీలర్ సీఎన్జీ వెహికల్స్‌లో గ్రాండ్‌గా సక్సెస్ అయిన సంస్థ బజాజ్ ఆటో.
ఇక ఇప్పుడు 2 వీలర్ సీఎన్జీ బైక్స్‌పై ఫోకస్ చేసింది. ఈ సరికొత్త సీఎన్జీ బైక్స్ కోసం ప్రత్యేకంగా ఒక బ్రాండ్‌ని సృష్టిస్తున్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. అయితే పెట్రోల్ ఆధారిత బైక్స్‌తో పోల్చుకుంటేఈ సీఎన్జీ 2 వీలర్ వెహికల్స్ ధర కాస్త ఎక్కువే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మేన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. సీఎన్జీ బైక్స్ కోసం ఫ్యూయెల్ ట్యాంక్స్‌ని ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ ఫ్యూయెల్ ట్యాంక్‌లో పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్స్ ఉండాలి. ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
అయితే మరి ఈ సీఎన్జీ బైక్స్ పూర్తిగా కొత్తగా ఉంటాయా? లేక ఇప్పుడున్న బైక్ మోడల్స్‌కి సీఎన్జీ టచ్ ఇస్తుందా? అన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం మార్కెట్లో అనేక సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని ఐసీఈ ఇంజిన్ మోడల్స్‌కి సీఎన్జీ టచ్ ఇచ్చినవే. అయితే.. ఒక్క బైక్ లాంచ్ చేసి, దానికి ఎంతటి ఆదరణ లభిస్తోంది? అని చూసి, మరో బైక్‌ని రూపొందించడం కాకుండా వరుసగా సీఎన్జీ బైక్స్‌ని తయారు చేసి, వాటిని మార్కెట్లో విడుదల చేయాలన్న స్ట్రాటజీతో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూయెల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ సీఎన్జీ బైక్స్‌ని రూపొందిస్తున్నట్టు శర్మ తెలిపారు. ఒక్క బైక్‌ని మాత్రమే లాంచ్ చేయడం లేదు. ఈ సెగ్మెంట్లో వివిధ బైక్స్‌ని లాంచ్ చేస్తున్నాము. సీఎన్జీ మోటార్‌సైకిల్స్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్ట్‌ఫోలియో ఉండాలన్నది మా ఆలోచన అని శర్మ వివరించారు.
Related News
Bajaj CNG Motorcycle: భారత మార్కెట్లోకి CNG బైక్.. లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివే..?
ప్రపంచంలోనే తొలి CNG బైక్ (Bajaj CNG Motorcycle) కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.