Auto Tips: ట్రాఫిక్ లో 1 నిమిషం పాటు కారు ఆగితే ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో మీకు తెలుసా?
ట్రాఫిక్ లో వాహనాలను ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి నిపుణులు తెలిపారు.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 8 November 24

మామూలుగా మనం ఎప్పుడైనా కార్ లో బయటకు వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ గంటల తరబడి అలాగే ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది వెంటనే కారు ఇంజన్ ఆఫ్ చేస్తే మరి కొంత మంది మాత్రం కారు ఇంజన్ ను ఆఫ్ చేయకుండా అలాగే రన్నింగ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరు హైదరాబాదు వంటి పెద్ద పెద్ద సిటీలలో అయితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. అలా బైక్ కానీ, కాదు గాని ఆఫ్ చేయకుండా అలాగే ఆన్ లో ఉంచేస్తూ ఉంటారు.
అటువంటి పరిస్థితిలో వాహనంలో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కానీ ఈ సందర్భంలో ఇంధన వినియోగం ఎంత ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? కారును ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆపడం, లేదా సిగ్నల్స్ వద్ద ఆపడం వల్ల ఇంధనం వినియోగం కారు రకం, ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీ కారు ఇంజిన్ 1000 నుండి 2000 సీసీ మధ్య ఉంటే, 1 నిమిషం స్టాప్ కు 0.01 నుండి 0.02 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుందట. అలాగే చిన్న ఇంజన్లు 1000 నుండి 1200 సీసీ చిన్న ఇంజన్లు కలిగిన వాహనాలకు 1 నిమిషంలో సుమారుగా 0.01 లీటర్ పెట్రోల్ ను ఖర్చవుతుందట.
ఇక మద్యస్థ ఇంజన్లు అనగా 1500 సీసీ వరకు ఈ వాహనాలు నిమిషానికి 0.015 లీటర్లు వినియోగించుకుంటాయట. 2000 సీసీ పైన ఉండే పెద్ద ఇంజన్లు 1 నిమిషంలో 0.02 లీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయట. అయితే దీని ఆధారంగా మీ కారు నిరంతరం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సి వస్తే ఒక నెలలో ఎంత ఇంధనం ఖర్చవుతుందో ఆలోచించడం మంచిది. అందుకే నిపుణులు మీ వాహనం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్నప్పుడు ఆఫ్ చేయడం మంచిది అని చెబుతున్నారు. ఇలా ఆఫ్ చేయడం వల్ల ఇంజన్ ఆదా అవుతుంది.
ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఇంధనం నిరంతరం ఉపయోగించబడుతుంది. ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా ఇంధన వినియోగం వెంటనే ఆగిపోతుంది. దీని ద్వారా ఇంధనం ఆదా చేసుకోవచ్చు. వాహన ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల ఉద్గారాలు ఆగిపోతాయి. ఇది పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వాహనం ఏదైనా సరే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఆఫ్ చేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు.