TVS Jupiter vs Honda Activa: టీవీఎస్ జూపిటర్ వర్సెస్ హోండా యాక్టీవా.. వీటిలో ఏది బెస్టో మీకు తెలుసా?
టీవీఎస్ జూపిటర్ వర్సెస్ హోండా యాక్టీవా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అన్న విషయం గురించి వివరణ ఇచ్చారు.
- By Anshu Published Date - 02:00 PM, Fri - 23 August 24

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్కూటర్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా స్కూటర్లు కూడా ఒకటి. ఈ రెండు స్కూటర్ లు ఒకదానికొకటి పోటీగా నిలుస్తూ వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలామందికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలియదా కాస్త కన్ఫ్యూజన్ అవుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సరికొత్త లుక్స్ తో పాటు సరికొత్త ఫీచర్లతో జూపిటర్ ను టీవీఎస్ ను తాజాగా విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో జూపిటర్ ఒకటి అని చెప్పాలి.
అయితే, హోండా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అయిన యాక్టివాకు దాని సొంత ఫ్యాన్ బేస్ ఉంది. యాక్టివా 6జీ 2020 లో లాంచ్ చేశారు. ఆ తరువాత హెచ్ స్మార్ట్ టెక్నాలజీతో 2023 లో అప్ గ్రేడ్ చేసి స్మార్ట్ వేరియంట్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు కొత్త జూపిటర్ కు ఐజీఓ అసిస్ట్ లభిస్తుంది. ఇది మెరుగైన మైలేజీని సాధించడంలో సహాయపడుతుందట. కాగా తాజాగా కొత్తగా లాంచ్ చేసిన టీవీఎస్ జూపిటర్ లో మునుపటి 109 సీసీ కంటే కొంచెం ఎక్కువ సీసీ ఉన్న 113 సీసీ 4 స్ట్రోక్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది ఇప్పుడు కొత్త ఐజీఓ అసిస్ట్ తో 7.9 బిహెచ్ పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్, అసిస్ట్ లేకుండా 9.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
మరోవైపు యాక్టివాలో 110 సీసీ సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ 7.7 బిహెచ్ పి పవర్, 8.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు స్కూటర్లు దాదాపు 105 కిలోల బరువును కలిగి ఉన్నాయి. ఈసారి జూపిటర్ పవర్ టు వెయిట్ నిష్పత్తి కొంత మెరుగైంది. అలాగే జూపిటర్ లో ఇప్పుడు కొత్త డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డిస్టాన్స్ టు ఎంప్టీ ఇండికేటర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, ఆటో స్టార్ట్ స్టాప్, రెండు హెల్మెట్లకు సరిపడా సీటు స్టోరేజ్, ఆటోమేటిక్ టర్న్ సిగ్నల్ డీయాక్టివేషన్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, ఎల్ఈడీ లైటింగ్, టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్, రియల్ టైమ్ మైలేజ్, వాయిస్ అసిస్ట్ తదితర కొత్త తరం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుత యాక్టివాలో హెచ్ స్మార్ట్ వేరియంట్ లో స్మార్ట్ కీ, కీలెస్ స్టార్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, యాక్టివా సీటు కింద ఒకే హెల్మెట్ కోసం తగినంత స్టోరేజ్ ను మాత్రమే పొందుతుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అప్ డేట్ ఇంకా రాలేదు. కాగా మునుపటి జూపిటర్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.
అయితే ఈసారి ఎలక్ట్రిక్ అసిస్ట్ టెక్నాలజీతో 10 శాతం మైలేజ్ పెరుగుతుందని హామీ ఇచ్చింది. హోండా యాక్టివా లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇకపోతే 2024 టివిఎస్ జూపిటర్ ధర రూ .73,700 నుండి ప్రారంభమవుతుంది, హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ ధర రూ .76,684 నుండి రూ .82,684 వరకు ఉంటుంది. జూపిటర్ ముందు వెనుక 12 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. యాక్టివాలో డ్రమ్ బ్రేకులు ముందు భాగంలో 12 ఇంచ్ ల వీల్, వెనుక భాగంలో 10-ఇంచ్ ల చిన్న చక్రం మాత్రమే ఉన్నాయి