TVS Apache RTR 160: మార్కెట్ లోకి లాంచ్ అయిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్?
ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
- By Anshu Published Date - 12:36 PM, Thu - 11 July 24

ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి తాజాగా విడుదలైన ఈ బైక్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాగా ఈ బైకు ధర రూ. 1,28,720 గా ఉంది. ఈ మోటార్ సైకిల్ బజాజ్ పల్సర్ ఎన్160, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, హోండా ఎస్పీ160 వంటి బైక్స్ కి పోటీగా మార్కెట్లోకి విడుదల అయ్యింది.
2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ కార్బన్ ఫైబర్ రేస్ ప్రేరేపిత గ్రాఫిక్స్, రేసింగ్ ఎడిషన్ లోగో, రెడ్ అల్లాయ్ వీల్స్‌తో ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ కలర్ స్కీమ్ లో వస్తుంది. ఇకపోతే టీవీఎస్ అపాచీ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ మోటార్ సైకిల్ 159.7సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, ఎఫ్ఐ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది. 16.04పీఎస్ గరిష్ట శక్తిని 13.85 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. డబుల్ క్రెడిల్ సింక్రొనైజ్డ్ స్టిఫ్ ఛాసిస్ ఆధారంగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు 5 దశల ఎడ్జెస్ట్ చేయగల షాక్ లను కలిగి ఉంది.
ట్యూబ్‌లెస్ టైర్‌లతో 17 అంగుళాలు ఉంటుంది. బ్రేకింగ్ వేరియంట్ ఆధారంగా 270ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ 200ఎమ్ఎమ్ డిస్క్/130ఎమ్ఎమ్ డ్రమ్ ద్వారా అందిస్తుంది. టీవీఎస్ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌లో 3 రైడ్ మోడ్‌లు, టీవీఎస్ స్మార్ట్ ఎక్సోనెక్ట్ డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్, జీటీటీ వంటి ఫీచర్లను అందిస్తోంది. టీవీఎస్ స్మార్ట్ టెక్నాలజీ వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌లు, రేస్ టెలిమెట్రీతో బ్లూటూత్ ను కూడా అందిస్తుంది.