AP Liquor Scam : విజయసాయి రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..ప్రతీకారాలు మొదలైనట్లేనా..?
AP Liquor Scam : విజయసాయిరెడ్డి చేసిన మద్యం కుంభకోణం ఆరోపణలపై కూడా వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు
- By Sudheer Published Date - 04:31 PM, Sat - 19 April 25

ఏపీలో లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) వైసీపీ (YCP) లో కాకరేపుతుంది. తాజాగా విజయసాయిరెడ్డి (Vijayasai) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల పరాజయం తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి.. తాజాగా మళ్లీ యాక్టివ్ అవుతూ వైసీపీపై సీరియస్ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం అంశంలో సాక్షిగా హాజరై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పార్టీకి నంబర్ 2గా ఉన్న తనను కోటరీ బలహీనంగా మార్చిందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం, వీడియో వైరల్!
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కౌంటర్ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో నంబర్ 2 అనే పదం లేదని, ఒకటినుంచి వంద వరకూ జగన్‌మోహన్ రెడ్డే అన్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. కోటరీ అనే మాటకు పార్టీ వ్యవస్థలో ఎటువంటి స్థానం లేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే కోటరీ ఉందా లేదా అనేది తెలియదా? అంటూ ప్రశ్నించారు.
కైపెక్కించే సోకులతో సెగలు రేపుతున్న రకుల్
విజయసాయిరెడ్డి చేసిన మద్యం కుంభకోణం ఆరోపణలపై కూడా వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షంగా ఉన్న పార్టీల నుంచి వస్తున్న విమర్శలు కావచ్చునే తప్ప, వాటిలో నిజం లేదన్నారు. ఈ అంశం కోర్టులో ఉందని, అక్కడే నిజం తేలనుందని వివరించారు. మొత్తానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, వాటికి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన కౌంటర్.. వైసీపీ అంతర్గత విభేదాలు బహిరంగమవుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు.