YV Subba Reddy : వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం
YV Subba Reddy : వైవీ సుబ్బారెడ్డికి సానుభూతి తెలుపుతూ, పలువురు రాజకీయ నేతలు, వైసీపీ శ్రేణులు ఆయనను పరామర్శిస్తున్నారు
- Author : Sudheer
Date : 17-03-2025 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (85) మంగళవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఈ విషాద సమాచారం అందిన వెంటనే, హుటాహుటిన ఒంగోలు బయల్దేరారు.
BCCI Meet IPL Captains: ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక సమావేశం!
యర్రం పిచ్చమ్మ భౌతికకాయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు తరలించగా, అక్కడ రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషాదం నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డికి సానుభూతి తెలుపుతూ, పలువురు రాజకీయ నేతలు, వైసీపీ శ్రేణులు ఆయనను పరామర్శిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం..నియోజకవర్గానికి 5 వేల మందికి ఉపాధి!
వైఎస్ కుటుంబానికి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి గల బంధం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, జగన్ హయాంలోనూ వైవీ సుబ్బారెడ్డి విశ్వసనీయ నేతగా వ్యవహరించారు. ఈ క్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు అంత్యక్రియలకు హాజరై చివరి ఘన నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు.