YV Subba Reddy : అప్పుడే పోటీ ఫై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన
- Author : Sudheer
Date : 14-11-2023 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో ఎన్నికల (TS Polls) హోరు నడుస్తుండగానే..ఏపీలో అప్పుడే ఎన్నికల (AP Polls) పోటీ ఫై నేతలు స్పందిస్తూ వేడి పెంచుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 03 న ఫలితాలు రాబోతున్నాయి. దీంతో తెలంగాణ లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ..ఎవరికీ వారు తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఏపీలో మర్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి నుండే ఎన్నికల ఫై నేతలు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నేత , టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy).. తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తారన్న ఆయన.. ప్రజలకు చేసిన కార్యక్రమాలు చూసి మరోసారి ఆశీర్వదించాలని జగన్ ప్రజలను కోరుతున్నారు అన్నారు.
ప్రస్తుతం పార్టీ చేపట్టిన సామాజిక, సాధికార బస్సు యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని..ఆ స్పందన చూసి విపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. మా పథకాలను చూసి మాకు ప్రజలు పట్టం కడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితమంటూనే దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. గతం కన్నా ఇప్పుడు ఇసుక మెరుగ్గా దొరుకుతుందని తెలిపారు.
Read Also : Varikapudisela Project : రేపు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన