YSRCP : నారాలోకేశ్ కు సంబంధించి ఆ ఫొటోలను షేర్ చేసిన వైసీపీ నేత…!!
అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
- Author : hashtagu
Date : 10-08-2022 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై జరుగుతున్న రచ్చలో భాగంగా బుధవారం వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. విదేశీ మహిళలతో టీపీడీ అగ్రనేత నారా లోకేశ్ ఉన్న ఫోటోలను అందులో పోస్టు చేశారు. అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడ్ టీడీపీ అంటూ కామెంట్స్ చేశారు.
ఒకరు …ఇద్దరు…కాదు నలుగురైదుగురు మహిళలతో విదేశాల్లో లోకేశ్ చేసిన రాసలీలు బాబుకుగానీ, ఆపార్టీ మహిళా నేతలకు గానీ కనిపించడంలేదా అంటూ ట్వీట్లో ప్రశ్నించారు. మహిళలతో లోకేశ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ
– ఒకరు కాదు.. నలుగురైదుగురు మహిళలతో విదేశాల్లో లోకేష్ చేసిన రాసలీలలు, శృంగార కార్యకలాపాలు బాబుకుగానీ, ఆ పార్టీ మహిళా నేతలకుగానీ అశ్లీలతగా కనిపించలేదా..!
– మహిళలతో లోకేష్ విశృంఖలతకు సంబంధించిన కొన్ని ఫోటోలు!! pic.twitter.com/DeJOO6EKzt— Nagarjuna Yadav (@ImYanamala) August 10, 2022