YS Sharmila : చంద్రబాబుకు హెచ్చరిక జారీ చేసిన వైస్ షర్మిల..
YS Sharmila : ఫ్రీ గ్యాస్ అంటూ.. ప్రభుత్వం ప్రజలపై కరెంట్ చార్జీల భారం వేస్తోందని షర్మిల ఆరోపించారు
- By Sudheer Published Date - 06:33 PM, Sat - 2 November 24

ఏపీ లో కరెంట్ చార్జీల పెంపు (Current Charges Hike) అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) స్పందిస్తూ..సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు హెచ్చరికలు జారీ చేసారు. ఫ్రీ గ్యాస్ అంటూ.. ప్రభుత్వం ప్రజలపై కరెంట్ చార్జీల భారం వేస్తోందని షర్మిల ఆరోపించారు. విద్యుత్ చార్జీలు సర్దుబాటు పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టాలు పెంచడం అన్యాయం అని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం “దీపం పెట్టామని” అని గొప్పలు చెప్పుకుంటూ, విద్యుత్ చార్జీల రూపంలో భారం వేస్తోందని “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం” ఇదేనని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపాలని పిలుపునిచ్చారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ప్రజలకు అందించే మొత్తం రూ.2685 కోట్లు అయినా, విద్యుత్ చార్జీల పెంపుతో అదనంగా రూ.6 వేల కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా 9 సార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే మార్గంలో నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే, ప్రజల భారం తగ్గించేలా ఆర్థిక సాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Read Also : Prashant Kishor : PK సలహా ఫీజు రూ.100 కోట్లు..!!