HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Open Letter To Cm Chandrababu

YS Sharmila : సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..జగన్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చెయ్యండి

YS Sharmila Open Letter To CM Chandrababu : అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని లేఖ లో పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 25-11-2024 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila Letter To Cm
Sharmila Letter To Cm

భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ (Adani Group)పై కీలక ఆరోపణలు వెలుగులోకి రావడం.. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కు కూడా ముడుపులు అందినట్లు తేలాడడంతో దీనిగురించి అంత చర్చిస్తున్నారు. పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్ల (PPA)లో జగన్ భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..సీఎం చంద్రబాబు (AP CM CHandrababu) కు లేఖ రాసారు. జగన్ చేసుకున్న ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలనీ కోరారు.

అదానీతో జగన్ మోహన్ రెడ్డి (Jagan) చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్‌ రెడ్డి గౌతమ్‌ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ సోమవారం లేఖ రాశారు.

అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని లేఖ లో పేర్కొన్నారు. అక్రమ ఒప్పందం తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం లక్షా 50 వేల కోట్లు. కాబట్టి వెంటనే డీల్ రద్దు చేయాలి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న వైసీపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.

జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయి. స్కీంల కోసం స్కాంలకు పాల్పడ్డట్లు ఆధారాలు సైతం చూపించాయి. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆండ్ కో కి రూ.1750కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్ట్ లో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. అదానీ, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది” అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Read Also : Thousand Jobs In Telangana: తెలంగాణ‌లో మ‌రో వెయ్యి ఉద్యోగాలు.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adani group
  • CM Chandrababu
  • jagan
  • open letter
  • ys sharmila

Related News

Manoj Babu

Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd