HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Demands Farm Loan Waiver In Andhra Pradesh

Runa Mafi : సీఎం చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన వైస్ షర్మిల

రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతీ రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని

  • Author : Sudheer Date : 19-07-2024 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Sharmila
Cbn Sharmila

తెలంగాణ సర్కార్ (Telangana Govt) రుణమాఫీ (Runa Mafi ) ప్రక్రియ ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు (Farmers and Congress Ranks) సంబరాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని , సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి చేశారని కొనియాడుతూ.. స్వీట్లు తినిపించుకుని డాన్సులు చేస్తున్నారు. గురువారం రూ. లక్ష వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6,098 కోట్లు జమ చేసింది.

తెలంగాణ సర్కార్ చేసిన ఈ గొప్ప పనికి దేశం మొత్తం మాట్లాడుకుంటూ సీఎం రేవంత్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల..సీఎం చంద్రబాబు కు తలనొప్పిగా మారింది. ట్విట్టర్ వేదికగా రుణ మాఫీ ఫై షర్మిల (YS sharmila) స్పందిస్తూ..

“15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అన్నారు. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని, తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

ఇక చంద్రబాబు కూడా ఏపీలో రుణమాఫీ చేయాలనీ ఈ సందర్బంగా షర్మిల డిమాండ్ చేసారు. రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతీ రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని, గత దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు మీ చేతులో ఉంది కాబట్టి ఎందుకు రుణమాఫీ చేయకూడదని చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలని పేర్కొన్నారు.

15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని @revanth_anumula రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే…

— YS Sharmila (@realyssharmila) July 19, 2024

Read Also : Venu Swami : బిగ్ బాస్ 8 లో వేణు స్వామి.. భారీ రెమ్యునరేషన్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • farm loan waiver
  • Telangana Runa Mafi
  • ys sharmila
  • YS Sharmila demands

Related News

58 Feet Bronze Potti Sriramulu Statue

అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

58 Feet Bronze Potti Sriramulu Statue  తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శా

  • ArcelorMittal Nippon Steel India secures land in Andhra Pradesh

    ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

  • Massive Fire Accident In Amaravati

    అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Ap Liquor Prices

    మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

Latest News

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

  • Gas Shortage : వంట గ్యాస్ వినియోగదారులకు గొప్ప శుభవార్త

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd