YS Sharmila : వైసీపీ జోకర్‌కు నా సవాల్.. తొలిసారి భారతి పేరు ప్రస్తావిస్తూ..
- By Sudheer Published Date - 12:29 PM, Tue - 30 January 24
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొంనేందుకు టీడీపీ-జనసేన కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. అయితే.. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా.. ఏపీలోనూ తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ద్విముఖ పోరుగా ఉన్న ఏపీ ఎన్నికలు ఇప్పుడు త్రిముఖ పోరుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వైసీపీ నేత జగన్ అరెస్టు తర్వాత షర్మిల భర్త అనిల్ ఢిల్లీ వెళ్లి షర్మిలను సీఎం చేయాలని సలహా ఇచ్చారని, అందుకోసం ప్రయత్నాలు కూడా చేసినట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ.. “నాపై, నా భర్తపై వికృత ఆరోపణలు చేయడానికి వైసీపీ జోకర్లను పంపుతోంది. నా భర్త, వదిన భారతి రెడ్డితో కలిసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. నా భర్త నాకు సీఎం పదవి ఇవ్వాలని అడిగారంటూ చేసిన ఆరోపణలకు ఈ వైసీపీ నేతలు వైఎస్ భారతితో చెప్పగలరా?
We’re now on WhatsApp. Click to Join.
“ఈ వైసీపీ జోకర్ నా భర్త ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి నాకు సీఎం పదవి ఇవ్వమని అడిగాడు. ప్రణబ్ జీ ఇక లేరని, ఈ ఆరోపణలపై తాను స్పందించలేనని ఆయన విశ్వాసం. వైసీపీ తమ ఆరోపణను ప్రణబ్ కుమారుడి ద్వారా కానీ, భారతి రెడ్డి ద్వారా కానీ ధృవీకరించాలని నేను సవాలు చేస్తున్నాను. అని అంశాన్ని షర్మిల ముగించారు. అయితే.. షర్మిల వైఎస్ జగన్ భార్య భారతి పేరును బయటకు తీసుకొచ్చే స్థాయికి వైఎస్ షర్మిల, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Read Also : Bald Head: మెంతి గింజలతో మీ బట్టతల మాయం..!