YS Sharmila : వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంది – షర్మిల
- By Sudheer Published Date - 01:31 PM, Wed - 24 January 24

AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..వైసీపీ ఫై విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
బుధువారం విశాఖపట్టణం (Vizag) జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశమైన షర్మిల.. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని విమర్శించారు. వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంటుందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం నోరు ఎత్తిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడం లేదని షర్మిల ప్రశ్నించారు. వైజాగ్ కు అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, పోలవరంలో 90శాతం ఇవ్వలేదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడుగులకు వత్తాసు పలికారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు గుప్పించారు.
విశాఖ ఉక్కు కర్మాగారంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఏపీ అభివృద్ధి బాటలో పయణించాలంటే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఆ మేరకు ప్రజలు ఏకంకావాలి, ఇప్పుడున్న ప్రభుత్వాలను ఇంటికి పంపాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.
Read Also : CM Revanth Security : సీఎం రేవంత్ భద్రతా విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..