HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Arrest

YS Sharmila : ఛలో సచివాలయం..చెల్లిని అరెస్ట్ చేయించిన అన్న

  • Author : Sudheer Date : 22-02-2024 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila Arrest
Sharmila Arrest

షర్మిల (YS Sharmila) తలపెట్టిన ఛలో సచివాలయం (Chalo Secretariat) ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో వైసీపీ సర్కార్ చెప్పిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టింది. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తో పాటు మిగతా నాయకులతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి సచివాలయంవైపు వెళ్తుండగా.. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్ట్ చేసే సమయంలో షర్మిల చేతికి స్వల్ప గాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే రాత్రి బస చేశారు. ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర..ఏలూరు రోడ్డు మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల్ని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల సెక్రటేరియట్ కు బయలుదేరారు. దీంతో గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

Read Also : Bikes Under 3 Lakh: రూ. 3 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే స్పోర్ట్స్ బైక్‌లు ఇవే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chalo secretariat
  • DSC
  • jagan
  • YS Sharmila Arrest

Related News

Konidela Village

కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

Latest News

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

  • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Trending News

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd