YS Jagan Nomination : జగన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్ ..?
22వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి
- By Sudheer Published Date - 08:41 AM, Thu - 11 April 24

వైసీపీ అధినేత, సీఎం జగన్ (YS Jagan) తన నామినేషన్ (Nomination ) కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారం దక్కించుకున్న జగన్..ఈసారి కూడా 175 కు 175 టార్గెట్ గా బరిలోకి దిగాడు. గత కొద్దీ రోజులుగా బస్సు యాత్ర తో ప్రజలను కలుస్తూ వస్తున్నారు. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 22వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహించనున్నారు. మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
Read Also : Weight Loss Tips at Home : అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఉదయం లేవగానే ఇవి తాగండి..సన్నబడడం ఖాయం