HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Implements Ntr Plan In District Bifurcation

AP Districts : జై ఎన్టీఆర్ -తూ. గో, ప.గో, కృష్ణా ఔట్?

ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు కానుంది. ఆ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వాభూషన్ ప్రకటించాడు

  • Author : CS Rao Date : 26-01-2022 - 1:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sr Ntr Ap Map
Sr Ntr Ap Map

ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు కానుంది. ఆ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వాభూషన్ ప్రకటించాడు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దం అయింది. కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించు కోవడానికి జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. జనాభా గణన దేశవ్యాప్తంగా జరగాలి. అది పూర్తి అయిన తరువాత జిల్లాలను విభజించాలి అని కేంద్రం ఆదేశించింది. కానీ, తెలంగాణ రాష్ట్రం విజవంతంగా 33 జిల్లాలతో రియల్ ఎస్టేట్ ను పెంచింది. ఆ క్రమంలో పరిపాలన భవనాలు రావడం తో అభివృద్ధి బాట పట్టింది.

పైగా కేంద్రం జోన్స్ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీలో కూడా అలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ సర్కార్ భావిస్తుంది. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు జగన్ 25 ప్లస్ 1 మొత్తం గా 26 జిల్లాలను చేస్తున్నాడు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ సిద్దం అయింది.ఈ మొత్తం ప్రక్రియలో గోదావరి , కృష్ణ జిల్లాల పేర్లు గల్లంతు కానున్నాయి. విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్ల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని భావిస్తున్నారు. కృష్ణ జిల్లా పేరును అలాగే ఉంచి కొత్తగా ఏర్పడే మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా? అనేది సందిగ్ధం. ఇక ఇప్పటి వరకు ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు మారనున్నాయి. కేవలం రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మాత్రమే గోదావరి జిల్లా గా నామకరణం చేస్తున్నారు.

హిందూపురం లోక్ సభ పరిధిలోని జిల్లాను సత్యసాయి జిల్లాగా నామకరణం చేస్తారు. అంతే కాదు ఇక నుంచి పుట్టపుర్తి హెడ్‌క్వార్టర్‌గా సత్యసాయి జిల్లా ఉంటుంది.చిత్తూర్ జిల్లాలో ఉండే తిరుపతి లోకసభ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు బాలాజీ జిల్లాగా నామకరణం చేస్తున్నారు. కృష్ణాజిల్లా… ఎన్టీఆర్ జిల్లా….రాజమండ్రి … గోదావరి జిల్లా…రాజంపేట లోక్ సభ కేంద్రం అయినప్పటికీ రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా… అన్నమయ్య జిల్లాగా నామకరణం జరిగింది.
బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా .. భవపురి జిల్లా గా పేరు పెట్టారు.అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా కొత్తగా ఏర్పాటు చేయటం తో 26 జిల్లాల ఏపీ గా రూపాంతరం చెందనుంది. ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పాడు. ఆ మేరకు ఇప్పుడు నామకరణం చేస్తున్నాడు.

దీనిపై టీడీపీ ఎలాంటి కామెంట్ కానీ , అభినందన కానీ చేయలేదు. కాకపోతే , మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఉంటుందా? లేక కృష్ణా కు బదులుగా ? అనేది తేలాలి. మొత్తం మీద పేర్లు పెట్టటం పై కొన్ని చోట్ల అభ్యంతరాలు మరికొన్ని చోట్ల హెడ్ క్వార్టర్ పెట్టె విషయంలో వ్యతిరేకత ఉంది. అధికారికంగా ప్రకటించిన తరువాత ఈ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే పీఆర్సీ ఇష్యూను మరిపించడానికి ఇలా జగన్ సర్కార్ గేమ్ ఆడుతుందని భావిస్తున్నారు. ఆ క్రమంలో కొత్త జిల్లాల అంశం ఎటు వైపు దారితీస్తుందో..చూద్దాం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 26 districts
  • andhrapradesh news
  • sr ntr
  • ys jagan

Related News

Accused Nithyananda Reddy

YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. పోలీసుల వేట తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. తాజాగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం

  • YCP's Masterplan Behind the Kadapa Riots... A Conspiracy Against the Coalition Government!!

    కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

  • Vijay is following Jagan once again — Roja

    Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

Latest News

  • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd