HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan And Sharmila Fight For Ysr Inheritance On Ysr Birth Anniversary

YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జ‌యంతికి వార‌స‌త్వ పోరు.. జ‌గ‌న్‌కు బిగ్‌షాక్ త‌ప్ప‌దా?

జ‌గ‌న్ సోద‌రి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

  • Author : News Desk Date : 08-07-2024 - 6:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan and Sharmila fight for YSR Inheritance on YSR Birth Anniversary
YS Jagan Sharmila

YS Jagan – Sharmila : సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల‌కు బిగ్‌షాక్ త‌గ‌ల‌బోతుందా? మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన చందంగా వైసీపీ ప‌రిస్థితి మార‌బోతుందా.. అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. జ‌గ‌న్ సోద‌రి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని నేనే అంటూ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ జ‌యంతిని వేదిక‌గా వినియోగించుకునేందుకు ష‌ర్మిల రెడీ అయ్యారు. నేడు జులై 8న (సోమ‌వారం) దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ జ‌యంతిని ప్ర‌తీయేటా వైసీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో భారీ స్థాయిలో విజ‌య‌వాడ వేదిక‌గా వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు ష‌ర్మిల ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ జాతీయ స్థాయి నేత‌ల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు పాల్గోబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం సైతం వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గోనున్నారు.

వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన జ‌గ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చారు. జ‌గ‌న్ గెలుపులో కీల‌క భూమిక పోషించింది వైఎస్ఆర్ అభిమానులే. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సీఎంగా కొన‌సాగిన కాలంలో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జాద‌ర‌ణ పొందారు. మ‌తాలు, కులాల‌కు అతీతంగా వైఎస్ఆర్‌కు అభిమానులు ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏక‌తాటిపైకి వ‌చ్చి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే మ‌ళ్లీ వైఎస్ఆర్ పాల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని భావించి భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. కానీ, ఐదేళ్ల కాలంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హా పాల‌న అందించ‌డంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీనికి తోడు ష‌ర్మిల‌, వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ను పార్టీకి దూరం చేసుకున్నారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ష‌ర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ కొద్దికాలంకే దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ త‌రువాత ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల గెలుపుకోసం ష‌ర్మిల ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ రాజ‌కీయ‌ వార‌స‌త్వాన్ని నేన‌ని ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మితో అధికారాన్ని కోల్పోయింది. ఎన్నిక‌ల్లో కొంత‌భాగం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులు వైసీపీకి దూర‌మ‌య్యారు. వారితోపాటు, ఏపీలో వైఎస్ఆర్ అభిమానుల‌ను కాంగ్రెస్ వైపుకు మ‌ళ్లించేందుకు ష‌ర్మిల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ జ‌యంతిని పెద్దెత్తున‌ నిర్వ‌హించ‌డం ద్వారా తానే వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అని చాటి చెప్పేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో ష‌ర్మిల విజ‌య‌వంతం అయితే వైసీపీకి రాజ‌కీయంగా గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ష‌ర్మిల వ్యూహం స‌ఫ‌లం కాకుండా అడ్డుకునేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నాలు షురూ చేశారు. క‌డ‌ప టూర్‌లో ఉన్న జ‌గ‌న్‌.. వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల‌ను అక్కడ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల‌ను పెద్దెత్తున నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌స‌త్వం నాదంటే నాదంటూ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో చివ‌రికి ఎవ‌రిది పైచేయి అవుతుంద‌నే అంశం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ys jagan
  • ys rajasekhar reddy
  • ys sharmila
  • ysr
  • YSR Birth Anniversary

Related News

Polavaram Project

జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Polavaram Project  దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd