YS Bharathi PA : వైఎస్ భారతి పీఏ అరెస్ట్..?
జగన్ భార్య వైఎస్ భారతి పీఏ పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 22-06-2024 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి..నేతల రాజీనామాలు ..ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం.ఇవే అనుకునే ఇప్పుడు అక్రమంగా తన క్యాంపు కార్యాలయాలను కట్టినందుకు గాను కొత్త ప్రభుత్వం కూల్చివేత మొదలుపెట్టింది. శనివారం ఉదయం తాడిపల్లి లో నిర్మాణంలో ఉన్న వైసీపీ క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేశారు.. ఇదే సందర్బంగా జగన్ భార్య వైఎస్ భారతి పీఏ పీఏ వర్రా రవీంద్రరెడ్డిని (YS Bharathi PA Ravindra Reddy) పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు తేలింది. పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులపై సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పెట్టడం జరిగింది. దీంతో వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కడప నుంచి కదిరి వెళ్లే మార్గమధ్యలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే… వర్రా రవీంద్ర రెడ్డిని ఏ పోలీసులూ అరెస్ట్ చేయలేదని.. ఇదంత టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కావాలనే వైసీపీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ అరెస్ట్‌పై పోలీసుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : Vijay Devarakonda : కల్కి కోసం దేవరకొండ.. ఎంత డిమాండ్ చేశాడు..?