Jagan Advertisement : వైసీపీ పాలన లో పత్రిక ప్రకటనలకు పెట్టిన ఖర్చు ఎంతంటే..!!
సొంత పత్రిక సాక్షి కి భారీగా కోట్లు కుమ్మరించడం తో పాటు మిగతా పత్రికలకు సైతం పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాల ప్రకటనలు అందజేశారు
- Author : Sudheer
Date : 26-07-2024 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
గడిచిన ఐదేళ్లలో ఏపీలో జగన్ (Jagan) పాలన ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. చేసింది గోరంత చెప్పుకుంది కొండంత మాదిరిగా జగన్ గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యంగా జగన్ పాలనలో మీడియా పత్రికలు (Media Advertisement ) లాభాలు దక్కించుకున్నాయి. సొంత పత్రిక సాక్షి కి భారీగా కోట్లు కుమ్మరించడం తో పాటు మిగతా పత్రికలకు సైతం పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాల ప్రకటనలు (Ads) అందజేశారు. దీనికి సంబదించిన వివరాలు ఈరోజు ఏపీ అసెంబ్లీ లో మంత్రి పార్థసారథి వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదేళ్లలో ఒక్క సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 403 కోట్లు. మిగతా 20 పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు రూ. 488 కోట్లు అని తెలిపారు. వాటిలో ఈనాడు- రూ. 190 కోట్లు, సాక్షి రూ.293 కోట్లు, ఆంధ్రజ్యోతి- రూ.21 లక్షలు, ఆంధ్రప్రభ-14.5 కోట్లు, వార్త-13.71 కోట్లు, ప్రజాశక్తి-11.11 కోట్లు, హిందూ- 41 కోట్లు, న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్-30.03 కోట్లు, డీసీ-రూ. 40 కోట్లు, హాన్స్‌ఇండియా రూ.-7 కోట్లు, పయనీర్ – 9 కోట్లు రూపాయల యాడ్స్ ఇచ్చారని, డిజిటల్ యాడ్స్ ఐఎన్పీఆర్ పరిధిలో లేదన్నారు మంత్రి పేర్కొన్నారు. అవి కూడా కలిపితే ఆ లెక్క ఇంకా పెరుగుతుందని వెల్లడించారు.
గత 5 ఏళ్ళలో, భార్య నడిపే సాక్షికి, ప్రకటనల రూపంలో దోచిపెట్టిన జగన్ రెడ్డి
కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు : రూ.403 కోట్లు
మిగతా 20కి పైగా పత్రికలకి, ఇచ్చిన ప్రకటన ఖర్చు : రూ.488 కోట్లుసతీమణి నడిపే సాక్షికి, డబ్బులు దోచిపెట్టటంపై, హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తాం. ఈ… pic.twitter.com/1sWXZo63do
— Telugu Desam Party (@JaiTDP) July 26, 2024
Read Also : Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్