YCP MP Masthan Rao : వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్
కారుతో ఢీకొట్టి ఓ యువకుడు ప్రాణం పోవడానికి ఆమె కారణంగా గుర్తించిన చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు
- By Sudheer Published Date - 11:44 PM, Tue - 18 June 24

రోడ్డు ప్రమాదం కేసులో ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు (YCP MP Masthan Rao ‘s Daughter) కుమార్తె మధురి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో ఢీకొట్టి ఓ యువకుడు ప్రాణం పోవడానికి ఆమె కారణంగా గుర్తించిన చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఇటీవల చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో వృత్తిరీత్యా పెయింటర్ అయిన సూర్య (24) ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలోనే అదే రోడ్డులో వస్తున్న మాధురి కారు అతివేగంతో సూర్యపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కారు నడిపింది వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురు మాధురిగా నిర్ధారించారు. దీంతో ఆమెను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంటనే ఆమెకు బెయిల్ రావడం గమనార్హం. కాగా మృతి చెందిన యువకుడు సూర్యకు పెళ్లయ్యింది. పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతడి అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. మాధురి అరెస్ట్ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : Sangareddy : బయటకు కోళ్ల ఫామ్..లోపల మత్తుపదార్దాల తయారీ..ఏమన్నా ప్లానా..!!