AP MLA son in law suicide : వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి..?
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి...
- Author : Prasad
Date : 20-08-2022 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని తన నివాసంలో ఆయన మరణించారు. కొంత కాలంగా మంజునాథరెడ్డి భార్యతో కలిసి స్థానిక అవంతి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మూడు రోజుల క్రితం అపార్ట్‌మెంట్‌కు వచ్చిన మంజునాథరెడ్డి శుక్రవారం శవమై కనిపించారు.
మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తొలుత విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఘటనా స్థలంలో పరిస్థితులు, స్థానికులు చెబుతున్న అంశాలను పరిశీలిస్తే ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. మంజునాథరెడ్డి ఫ్లాట్ బాధ్యతలు చూసే నరేంద్ర రెడ్డి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఇంటి లోపలికి వచ్చారు అని ఆ తర్వాత కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులూ గోప్యత వహిస్తున్నారన్న ఆరోపణలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. మంజునాథరెడ్డి గుత్తేదారు కాగా..ఆయన భార్య వైద్యురాలు నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమయింది…