YCP Leaders : అప్పుడు తిట్టారు..ఇప్పుడు ఆదుకోండి అని వేడుకుంటున్నారు
YCP Leaders : జగన్ మెప్పు పొందడం కోసం తమ స్థాయిని కూడా మరచిపోయి..నానా బూతులు మాట్లాడాడారు. అధికారం శాశ్వతం కాదని..ఈరోజు తమది కావొచ్చు..రేపు వారిది అనేది మరచి..తమదే రాష్ట్రం.
- By Sudheer Published Date - 03:00 PM, Tue - 5 November 24

ఐదేళ్ల అధికార మదంతో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. జగన్ మెప్పు పొందడం కోసం తమ స్థాయిని కూడా మరచిపోయి..నానా బూతులు మాట్లాడాడారు. అధికారం శాశ్వతం కాదని..ఈరోజు తమది కావొచ్చు..రేపు వారిది అనేది మరచి..తమదే రాష్ట్రం..తమ పార్టీదే ఎప్పటికి గెలుపు అన్నట్లు వ్యవహరించారు. చంద్రబాబు స్థాయి లాంటి వ్యక్తులను సైతం నోటికొచ్చినట్లు మాట్లాడాడారు. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్ని తిట్టారో అన్ని తిట్టారు.
ఆయన ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం వదల్లేదు. కేవలం రాజకీయ పరంగానే కాదు చిత్రసీమ పై కూడా పెత్తనం చెలాయించారు. ఇలా ఎన్ని చేయాలో అన్ని చేసి..ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రజలు ఇచ్చిన దెబ్బ కు ఉరే కాదు రాష్ట్రం , కొంతమంది దేశం వదిలి కూడా పారిపోయారు. ఇంకొంతమందైతే ఫలితాల లెక్కింపు రోజు కనిపించారు..మళ్లీ ఇంతవరకు జడ లేదు. ఇన్ని చేసిన వారిని కూటమి సర్కార్ ఊరికెనే వదిలిపెడుతుందా..? ఒక్కడి లెక్క సరిచేసే పని మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జైలు ఊసలు లెక్కపెడుతూ….పోలీసుల లాఠీ దెబ్బలు రుచి చూస్తూ చేసిన పాపానికి చెప్పలు వేసుకుంటున్నారు.
మరికొంతమంది ఇపుడెప్పుడు లోపల వేస్తారో అని భయంతో చాస్తున్నారు. కొంతమంది మాత్రం వీటి నుండి తప్పించుకునేందుకు కూటమి లో చేరాలని తెగ ట్రై చేస్తున్నారు. ఆరుగురు మంత్రులు జనసేన, టీడీపీల్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. వారితో పాటు పదుల సంఖ్యలో ఇతర స్థాయి నేతలు కూడా అదే దారిలో ఉన్నారట. వీరిని ఆపేందుకు వైసీపీ అధిష్టానం గట్టిగానే ట్రై చేస్తున్నప్పటికీ వారు మాత్రం అస్సలు వినడం లేదట. మాకు పదవులు వద్దు ఏమి వద్దు..జైలు కు వెళ్లకుండా ఇంట్లో ఉంటె చాలు అని చెపుతున్నారట. మరి వీరిని కూటమి దగ్గరకు చేర్చుకుంటుందో లేదో చూడాలి.
Read Also : Chevireddy : ఒకఆడబిడ్డ తండ్రి ఆవేదన..నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే