Davos : చంద్రబాబు దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసమా..? వీళ్ళవి నోరులేనా..?
- By Sudheer Published Date - 06:56 PM, Thu - 23 January 25

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు & లోకేష్ బృందం (Chandrababu & Lokesh) దావోస్ పర్యటన(Davos Tour)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజులకు పైగా సాగిన ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి మెర్ఎస్కే వంటి సంస్థలతో కలిసి చర్చలు జరిపారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటన సక్సెస్ కావడం పట్ల కూటమి శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలకు మాత్రం ఈ పర్యటన విజయవంతం కావడం తో కడుపు కాలిపోతుంది. తమ హయాంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తేలేకపోయామే అని బాధలేకుండా..చంద్రబాబు & లోకేష్ విజన్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. విమర్శలకు కేరాఫ్ గా ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు పై విమర్శలు చేసారు.
Rural Development: గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ.. రూ. 2773 కోట్లు మంజూరు!
దావోస్ నుంచి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందని రాంబాబు ప్రశ్నించారు. ‘దావోస్ వెళ్లి రావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది’ అంటూ ట్వీట్ చేస్తే..మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath), చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒట్టి చేతులతో వస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం రూ.వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాయని పేర్కొన్నాడు. చంద్రబాబు దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసం తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు అట్టర్ ఫ్లాప్. ఈ పర్యటన కోసం సర్కార్ రూ.3 కోట్ల ప్రజాధనం వృథా చేసింది’ అని కామెంట్స్ చేసారు. వీరి కామెంట్స్ పై కూటమి శ్రేణులు , యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లు మీరు ఏంచేశారు..? ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు..? ఎన్ని సంస్థలు వచ్చాయి..? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు..? రాష్ట్రాన్ని ఏ మేరకు అభివృద్ధి చేసారంటూ..? వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
దావోస్ వెళ్ళిరావడానికి
ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ?
దావోస్ నుండి పెట్టుబడులు
ఏమేరకు తెచ్చారు ?
తెలియపరిస్తే వినాలని ఉంది !@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) January 23, 2025