Nagari Roja : నా ఓటమి కోసం YCP నేతలు ప్రచారం చేస్తున్నారు – రోజా
- Author : Sudheer
Date : 13-05-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
నగరి(nagari)లో తనను ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా పనిచేస్తున్నారని మంత్రి రోజా (RK Roja) ఆరోపించారు. జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న కేజే కుమార్, ఆయన వర్గీయులు తన ఓటమి కోసం పనిచేస్తున్నారని మీడియా ముందు వాపోయింది.ఇప్పటికే నగరిలో రెండుసార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించిన RK రోజా..మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. కానీ ఆమె విజయాన్ని సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
నగరిలో తన ఓటమి కోసం వైసీపీలో కొందరు నేతలు పనిచేస్తున్నారని ఆర్కే రోజా బాంబు పేల్చారు. ఇన్నాళ్లూ పార్టీలో తన ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఎన్నికల వేళ తన ఓటమికి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న వైసీపీ నేత కేజే కుమార్ వంటి వారు తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల కంటే వీరే తన ఓటమికి ఎక్కువగా కష్టపడుతున్నారన్నారు. ఇప్పటికే నగరిలో రోజాకు ప్రత్యర్థులు పెరిగారని, ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు కష్టమేనని నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో స్వయంగా ఆమే తన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో చెప్పేయడంతో నగరిలో రోజా ఓటమి ఖాయం అంటూ ఆమె మాటలు విన్న వారంతా మాట్లాడుకుంటున్నారు.
పాపం రోజమ్మ
మొహంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
"నాకు టీడీపీ వాళ్ళతో ఇబ్బంది లేదు… సొంత వాళ్ళే టీడీపీ కి ఓటు వెయ్యమని చెబుతున్నారు"#RKRoja #rkrojaselvamani #Nagiri #Roja #HelloAP_ByeByeYCP pic.twitter.com/zKLhPBZ0LD
— ℙ𝕟 ℍ𝕒𝕣𝕚𝕟𝕚 (@PnHarini) May 13, 2024
Read Also : AP – TS Poll : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ముగిసిన పోలింగ్