Hindhupuram : టీడీపీ కంచుకోటపై జగన్ కన్ను..రికార్డు తిరగరాలని ప్లాన్
- Author : Sudheer
Date : 09-01-2024 - 9:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ కంచుకోటల్లోనే కాదు..టీడీపీ కంచుకోటల్లో కూడా విజయం సాధించి చంద్రబాబు ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ చూస్తున్నాడు. అందులో భాగంగా టీడీపీ కంచు కోట అయినా హిందూపురం ఫై జగన్ కన్నేశాడు. టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయకేతనం. ఒక్కసారి కూడా మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు అక్కడి ఓటర్లు.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందర్నీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు.. అలాంటి అసెంబ్లీ ఫై జగన్ కన్నేసాడు.
1983 లో హిందూపురం నుండి ఎన్టీఆర్ మూడు సార్లు, వెంకట్రాముడు ఒకసారి అబ్దుల్ ఘనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు. అలాంటి హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేసి చరిత్ర తిరగరాయాలని జగన్ చూస్తున్నారు. అందుకోసం బెంగుళూరులో వ్యాపారాలు చేసుకొనే దీపికని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి మరీ తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపారు.
We’re now on WhatsApp. Click to Join.
హిందూపురం నియోజకవర్గం లో ముస్లిం, బీసీ ల ఓట్లు అత్యధికం..హిందూపురం పట్టణంలోనూ ముస్లిం ఓట్లు, రూరల్ ప్రాంతాలలో బీసీ ల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. హిందూపురంలో మహిళా అభ్యర్థులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ను ఓడించేందుకు బీసీ మహిళా అస్త్రం ప్రయోగించాలని వైసీపీ సిద్దమైంది.ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో మహిళకు టికెట్ ఇవ్వలేదని.. గెలిపించుకుంటే దీపికను మంత్రి పదవి కూడా ఇస్తారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ టీడీపీ కాకుండా మరో పార్టీ గెలిచే పరిస్థితి లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 60 వేల ముస్లిం సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి.. ఇక 90 వేల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. సహజంగా టీడీపీకి బీసీల పార్టీ అన్న పేరుంది. హిందూపురం నుంచి టీడీపీ నుండి ఎన్టీఆర్ తర్వాత బీసీ అభ్యర్ధులను బరిలోకి దింపింది. వారిని కూడా మంచి మెజార్టీ తో గెలిపించారు అక్కడ ఓటర్లు .. ఇప్పుడు ఆ గెలిచిన మాజీ ఎమ్మెల్యే లు టిడిపి తరపున బాలయ్య కు అండగా ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా వారి అండదండలతో బాలకృష్ణ గెలుపు ఖాయమని అంటున్నారు. ఇక్కడ వైసీపీ లో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయని..ఒకే పార్టీ లో నలుగురు గ్రూపులుగా విడిపోయి..రాజకీయాలు చేస్తున్నారని..ప్రజలు వీరిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి లేదని చెపుతున్నారు. చూడాలి మరి ఏంజరగబోతుందో..
Read Also : Naa Saami Ranga Trailer Talk : యాక్షన్ తో నింపేసిన ‘నా సామిరంగ’ ట్రైలర్ ..