Naa Saami Ranga Trailer Talk : యాక్షన్ తో నింపేసిన ‘నా సామిరంగ’ ట్రైలర్ ..
- Author : Sudheer
Date : 09-01-2024 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
కింగ్ నాగార్జున (Nagarjuna) , ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రధాన పాత్రలో ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న మూవీ ‘నా సామిరంగ’. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నాగ్..ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ , పోస్టర్స్ ప్రతిదీ సినిమా ఫై పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరింత అంచనాలు పెంచారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే…ట్రైలర్ అంత కూడా ఎక్కువగా యాక్షన్ తో నింపేశారు. సినిమాలో నాగ్..ఓ రేంజ్ లో యాక్షన్ చేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా మన్మధుడు కుమ్మేసినట్లు తెలుస్తుంది. వీటితో పాటు స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామా కూడా గట్టిగానే ఉండేలా డైరెక్టర్ విజయ్ చూసుకున్నాడు. ట్రైలర్లో నాగార్జున తర్వాత అల్లరి నరేష్ పాత్ర బాగా హైలైట్ చేసారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏం ఏం కీరవాణి చాల రోజుల తర్వాత నాగ్ తో వర్క్ చేసారు. గతంలో వీరిద్దరి కలయికలో ఎన్నో సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అక్కినేని ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ ఇచ్చినట్లు సినిమాలో పాటలు వింటుంటే తెలుస్తుంది. ఓవరాల్ గా ‘నా సామిరంగ’ సంక్రాంతికి థియేటర్స్ లలో ‘సామిరంగ’ …దుమ్ములేపాడో పో..అనే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది.
Read Also : Vibrant Gujarat Global Summit: యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం