HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Decides To Boycott Graduate Mlc Elections

YCP MLC Elections : ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!!

YCP : 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు

  • Author : Sudheer Date : 07-11-2024 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Mlc
Ycp Mlc

ఏపీలో వైసీపీ పార్టీకి (YCP) గడ్డు కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు సార్లు తామేదో అధికారం అని విర్రవీగిన జగన్ బ్యాచ్..కూటమి దెబ్బకు కుదేలయింది. 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు. ప్రజల దెబ్బకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న జగన్ బ్యాచ్ కి కూటమి సర్కార్ ఇస్తున్న వరుస షాకులతో ఏంచేయాలో తెలియడం లేదు. అందుకే వరుస పెట్టి వైసీపీ కి రాజీనామా చేస్తూ తదుపరి రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు(YCP Decides To Boycott Graduate MLC Elections) దూరంగా ఉంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికను ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వైసీపీ సీనియ‌ర్ నేత‌లు పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ నేత‌లు స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ను ప్ర‌భుత్వం ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ప‌రిస్థితి లేదు. అప్ర‌జాస్వామికంగా పాల‌న సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ త‌ప్పుడు పోక‌డ‌ల‌ను నిర‌సిస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్నాం. ప‌క్ష‌పాతం లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఓట‌రు ఓటు వేసుకునే ప‌రిస్థితి లేదు. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణ‌యాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంగీక‌రించార‌ని, ఈ దుర్మార్గ వాతావ‌ర‌ణంలో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రుగ‌వు కాబ‌ట్టి ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్ని నాని వెల్ల‌డించారు.

ఈ ప్రకటన పై టీడీపీ రియాక్ట్ అయ్యింది. EVMల పై నమ్మకం లేదని చెప్పిన జగన్ రెడ్డి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నా సాకులు చెప్పి పారిపోతున్నాడు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి, తమకు ఎలాగూ ఓట్లు రావని, జగన్ రెడ్డి డిసైడ్ అయిపోయి, పోటీ చేయకుండానే పారిపోయాడు అంటూ ట్వీట్ చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి కనీస ఓట్లు తెచ్చుకోకపోతే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న భయంతో పోటీకి దూరంగా ఉంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఎన్నికలేనా..రాబోయే ఎన్ని ఎన్నికలకు కూడా ఇలాగే భయపడి దూరంగా ఉంటారా..? అనేది చూడాలి.

Read Also : Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boycott Graduate MLC Elections
  • guntur
  • jagan
  • krishna
  • perni nani
  • ycp

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిష

    Latest News

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd