Yarlagadda Venkata Rao : లోకేశ్ విదేశీ పర్యటనపై యార్లగడ్డ ప్రశంసలు, వైసీపీపై విమర్శలు
Yarlagadda Venkata Rao : రాష్ట్రం కోసం లోకేష్ చేస్తున్న కృష్ణి అభినందించాల్సింది పోయి..కొంతమంది వైసీపీ నేతలు విమర్శలు , ఆరోపణలు చేయడం సరికాదని , లోకేష్ సమావేశం అవుతున్న సంస్థల గేట్లను కూడా తాకే సత్తా ఈ వైసీపీ నేతలకు లేదని సెటైర్లు వేశారు.
- Author : Sudheer
Date : 11-12-2025 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన నియోజకవర్గంలో చురుకుగా ఉంటూ, ప్రతిరోజూ ఏదొక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. మంత్రులు కూడా పెద్దగా వార్తల్లో ఉంటున్న దాఖలాలు తక్కువ కానీ యార్లగడ్డ వెంకట్రావు మాత్రం ప్రతి రోజు ప్రజల వద్దకు వెళ్తూ..ఏదొక కార్యక్రమం చేపడుతూ మీడియా లో నిలుస్తున్నారు. రాజకీయ నేతలంటే గెలిచామా..అప్పుడప్పుడు ప్రజల వద్దకు వెళ్ళామా అని కాకుండా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేరవేస్తూ వారి మన్నలను పొందుతున్నారు.
తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లోకేష్ ఎంతలా కష్టపడుతున్నాడో ..రాష్ట్ర మేలు , అభివృద్ధి కోసం ఏమేమి చేస్తున్నాడో వంటివి వివరించారు. ఇక లోకేష్ పర్యటన పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై కూడా విరుచుకపడ్డారు. గత మీ హయాంలో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు..? ఏ ఏ సంస్థలు వచ్చాయి..? అంటూ గత వైసీపీ ప్రభుత్వం పై ప్రశ్నలు కురిపించారు.
Goa Club Owners : థాయ్లాండ్లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్
యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కెనడాలో పర్యటిస్తున్నారని తెలిపారు. టొరంటోలో లోకేశ్ పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, క్లీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి మరియు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలను ప్రారంభించాలని ఆయన కెనడియన్ సంస్థలను కోరగా, జాన్ రాడ్కో వంటి ప్రతినిధులు తమ కార్యకలాపాలను టైర్-2 నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నామని, ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు యార్లగడ్డ వివరించారు. అలాగే బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (BCC) అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో కూడా లోకేశ్ సమావేశమైనట్లు తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం యొక్క అభివృద్ధి పాలనను వివరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాలనానుభవం, దార్శనికతతో గత 18 నెలల్లోనే ఏపీకి రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని యార్లగడ్డ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ విధానం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ అని, వేగవంతమైన నిర్ణయాలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఏపీకి ఉన్న 1053 కి.మీ తీరప్రాంతం, ఆరు పోర్టులు, ఆరు విమానాశ్రయాలు రాష్ట్ర కనెక్టివిటీకి బలాన్నిస్తున్నాయని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లోపే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేస్తూ, చంద్రబాబు ఈ వయసులో కూడా యువకుడిలా పనిచేస్తూ అందరిలో ఉత్సాహం నింపుతున్నారని ప్రశంసించారు.
Lionel Messi in HYD: వామ్మో ..మెస్సీ తో ఫోటో దిగాలంటే రూ.9.95లక్షలు చెల్లించాలి !!
ఇదే సందర్బంగా యార్లగడ్డ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ ఎంత వెనక్కు పోయిందో ప్రజలకు తెలియంది కాదని ఆయన పేర్కొన్నారు. గత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టుబడులు తీసుకురమ్మంటే ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారో చూశామని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన సంస్థలు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఈ భారీ పెట్టుబడుల ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని యార్లగడ్డ వెంకట్రావు గుర్తు చేశారు. రాష్ట్రం కోసం లోకేష్ చేస్తున్న కృష్ణి అభినందించాల్సింది పోయి..కొంతమంది వైసీపీ నేతలు విమర్శలు , ఆరోపణలు చేయడం సరికాదని , లోకేష్ సమావేశం అవుతున్న సంస్థల గేట్లను కూడా తాకే సత్తా ఈ వైసీపీ నేతలకు లేదని సెటైర్లు వేశారు.