Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?
- Author : Sudheer
Date : 13-03-2024 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ (TDP) భారీ షాక్ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) వైసీపీ (YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుని (Tuni Constituency) టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య (Yanamala Divya) ఖరారు చేయడం తో కృష్ణుడు అసంతృప్తితో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణుడు నియోజకవర్గంలో పార్టీని పతిష్టం చేస్తూ వచ్చాడు. గత రెండు పర్యాయాలు యనమల కృష్ణుడు పోటీ చేసినా ఓటమి పాలమి అయ్యారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కృష్ణుడి కి కాకుండా యనమల దివ్యకు టికెట్ కేటాయించారు. ఈ నెల 15న లేదా 17న వైసీపీ కండువా కప్పుకునేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న జగన్…కీలకమైన నేతలను (కాపు, బీసీ) తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. నిజానికి రేపు ముద్రగడ వైసీపీలో చేరాల్సి ఉంది. సీఎం జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 15న లేదా 16వ తేదీన ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు. ఇక ఇప్పుడు యనమల కృష్ణుడు సైతం వైసీపీ లోకి వస్తుండడం తో వైసీపీ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంత అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా చేతిలో యనమల కష్ణుడు ఓటమిపాలయ్యారు.
Read Also : BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!