Brother Anil Kumar : బ్రదల్ అనిల్ కు చుక్కెదురు
బ్రదర్ అనిల్ కు తొలి ప్రయత్నంలోనే అనూహ్య వ్యతిరేకత తగిలింది. ఏపీలోకి అడుగుపెట్టొద్దని ఆ రాష్ట్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ హెచ్చరించాడు.
- By Hashtag U Published Date - 05:51 PM, Wed - 16 March 22

బ్రదర్ అనిల్ కు తొలి ప్రయత్నంలోనే అనూహ్య వ్యతిరేకత తగిలింది. ఏపీలోకి అడుగుపెట్టొద్దని ఆ రాష్ట్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ హెచ్చరించాడు. దైవ సందేశం అందించే అనిల్ రాజకీయ అవతారం ఎత్తడాన్ని తప్పుబట్టాడు. ప్రపంచ శాంతి దూతగా వైఎస్ పరిచయం చేసిన బ్రదర్ అనిల్ తెలంగాణ రాజకీయాలకు పరిమిత కావాలని హితవు పలకడం క్రిస్టియన్ కమ్యూనిటీలోని చీలికను సూచిస్తోంది.రెండు నెలల క్రితం రాజకీయాలతో సంబంధంలేదన్న బ్రదర్ అనిల్ ఇప్పుడు దేవుడి ఆదేశిస్తే..వస్తానని చెబుతున్నాడు. పైగా ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతానంటూ ఆసక్తికర ట్వీస్ట్ ఇచ్చాడు. పార్టీపరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని బ్రదర్ అనిల్ చెబుతున్నాడు. రెండు నెలల క్రితం ఏపీలో పార్టీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బ్రదర్ అనిల్ , ఉండవల్లి భేటీలోని అంశాలను పరిశీలిస్తే..జగన్ కు పోటీగా షర్మిల దిగుతోందని స్పష్టం అవుతోంది. బ్రదర్ అనిల్ ఏపీలో రాజకీయ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కూడా రాజకీయాల్లోకి నేరుగా దిగే పరిస్థితులు ఉన్నాయని ఆయన మాటల ద్వారా అర్థం అవుతోంది.
త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో అనిల్ ఉన్నాడని ఆయన సమావేశంలో పాల్గొన్న కొందరు చెప్తున్నారు. జగన్, వైసిపి వ్యతిరేక వర్గాల తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. కొత్త పార్టీ కింద పని చేద్దామని అనిల్ వెలుబుచ్చాడని బీసీ నేత నాగరాజు చెప్పాడు. కొత్త పార్టీ వివరాలను బ్రదర్ అనిల్ కొద్దీ రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే ఏపీ కి తరచు బ్రదర్ వెళుతున్నాడు. తొలుత చర్చ్ మీటింగ్స్ అని లైట్ గా చెప్పాడు. రాజకీయాలతో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసాడు. రొండో సారి ఉండవల్లి భేటీతో కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేరుగా సమావేశాలు పెట్టుకోవటం చూస్తే ఏపీలో బ్రదర్ అనిల్, షర్మిల దంపతులు కొత్త పార్టీ పెట్టుకొనే అవకాశాలు లేకపోలేదు.ఏపీ రాజకీయాలలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు బ్రదర్ అనిల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ సంఘాల నాయకులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనలో ఉన్నారని ఇటీవల ఆయన కామెంట్ కూడా సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు వివేకా హత్య కేసుపై కామెంట్స్ చేశాడు. దోషులు తప్పించుకోలేరని, సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తోందని అంటున్నాడు. ఆ క్రమంలో బ్రదర్ అనిల్ కుమార్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ విమర్శలు గుప్పించడం గమనార్హం. అగ్ర కులానికి చెందిన బ్రదర్ అనిల్ దైవ సందేశం ఇచ్చే దూతగా మారాడు. మాజీ సీఎం వైఎస్ ఆర్ ఆ విధంగా అనిల్ ను రూపొందించాడని ప్రవీణ్ అంటున్నాడు. అగ్ర కులానికి చెందిన అనిల్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని క్రిస్టియన్ అసోసియేషన్ అంటోంది. అంతేకాదు, ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దని హెచ్చరించడం ఏపీ క్రిస్టియన్ కమ్యూనిటీలో కలకలం రేపుతోంది.