HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Worlds Tallest Ambedkar Statue To Be Unveiled In Ap Today

AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన

  • Author : Sudheer Date : 19-01-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambedkar Statue In Vijayawa
Ambedkar Statue In Vijayawa

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై విమర్శలు చేసింది. ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని, దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని జగన్ చూస్తున్నాడని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్ఘాలు తీసే జగన్ కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే… దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని ప్రశ్నించింది. అంబేద్కర్ మహనీయుడు కోరుకున్నది ఎన్నికల వరకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాల ఏర్పాటా? అని అడిగింది. సమాజంలో దళితులపై వివక్ష పోవాలని అంబేద్కర్ అనుకున్నారని… కానీ, కంసమామ జగన్ దళితులని హత్యలు చేసిన వారిని చేరదీస్తున్నాడని దుయ్యబట్టింది.

ఇక అంబేద్కర్ విగ్రహం విషయానికి వస్తే..

85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్టించారు. దీంతో మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు మార్చారు. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్ తో తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహా మండలంగా రూపొందించారు. ఈ నిర్మాణం మొత్తం పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్ లోతు, షీర్ గోడలు, 50డిగ్రీల వంపుతిరిగిన ఆర్సీసీ స్లాబ్‌లు, బీమ్‌లతో 539 పైల్స్‌తో తయారు చేశారు. పెడెస్టల్ బిల్డింగ్ మొత్తం 11,140 కమ్ కాంక్రీటు, 1445MT టీఎంటీతో తయారు చేశారు. రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయితో క్లాడింగ్ చేశారు.

అంబేద్కర్ స్మారక చిహ్నం ముందుభాగంలో ఆరు జలవనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, పీఠం భవనం, పచ్చదనం కోసం 3 వైపుల పెరిఫెరల్ వాటర్‌బాడీతో ప్రకృతిని మైమరపింప చేస్తోంది. కాలచక్ర మహా మండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేద్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బేస్మెంట్ లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 8 వేల చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం తూర్పు, పడమర వైపు స్ధలం కేటాయించారు. ఇందులో 95 కార్లు, 84 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.

Read Also :  January 22 : రామమందిరం ప్రారంభోత్సవం రోజున రాశిఫలాలివీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambedkar statue
  • Janasena
  • vijayawada

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • Asus Opening

    ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd